Gharana bullodu: ఆ ఫంక్షన్‌లో సందడి చేసిన స్టార్‌ హీరోలు!

ABN , First Publish Date - 2022-09-17T02:16:15+05:30 IST

కింగ్ నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించిన రెండు చిత్రాల్లో హీరోగా నటించారు. అందులో మొదటి చిత్రం 'అగ్ని' 1989లో విడుదల అయింది.

Gharana bullodu: ఆ ఫంక్షన్‌లో సందడి చేసిన స్టార్‌ హీరోలు!

కింగ్ నాగార్జున(Nagarjuna), దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K raghavendrarao)నిర్మించిన రెండు చిత్రాల్లో హీరోగా నటించారు. అందులో మొదటి చిత్రం 'అగ్ని' 1989లో విడుదల అయింది. భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్లాప్ అయింది. ఆరేళ్ల అనంతరం మళ్లీ నాగార్జునతో దర్శకేంద్రుడు నిర్మించిన చిత్రం 'ఘరానా బుల్లోడు'(Gharana bullodu). రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా హిట్ అయింది. పది కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ చిత్ర శత దినోత్సవం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమం లో సూపర్ స్టార్ కృష్ణ,  మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, డాక్టర్ రాజశేఖర్ పాల్గొని సందడి చేశారు. అప్పట్లో ఒక సినిమా వంద రోజులు (100days function)ఆడిందంటే పరిశ్రమ మొత్తం సంతోషించింది. ఆ హిట్ ను హీరోలందరూ సెలబ్రేట్ చేసుకొనేవారు. ఇప్పుడు శతదినోత్సవం అనే మాటే కరువైంది. తొలి రోజు ఓపెనింగ్స్, ఫస్ట్ డే షేర్.. గ్రాస్..ఇలాంటి మాటలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. 

Updated Date - 2022-09-17T02:16:15+05:30 IST