సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tollywood : వినాయక చవితి

ABN, First Publish Date - 2022-08-30T21:08:24+05:30

శ్రీకృష్ణుడిగా ‘మాయాబజార్’ (Mayabazar) చిత్రం‌లో తన అద్భుత అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎన్టీఆర్ (NTR) 5 నెలల గ్యాప్ తర్వాత మరోసారి కృష్ణుడిగా నటించిన చిత్రం వినాయక చవితి (Vinayaka Chavithi). అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బేనర్ పై కే గోపాలరావు నిర్మించిన ఈ చిత్రానికి రచయిత సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya) దర్శకత్వం వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకృష్ణుడిగా ‘మాయాబజార్’ (Mayabazar) చిత్రం‌లో  తన అద్భుత అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ఎన్టీఆర్ (NTR) 5 నెలల గ్యాప్ తర్వాత మరోసారి కృష్ణుడిగా నటించిన చిత్రం వినాయక చవితి (Vinayaka Chavithi). అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బేనర్ పై కే గోపాలరావు నిర్మించిన ఈ చిత్రానికి రచయిత సముద్రాల రాఘవాచార్య (Samudrala Raghavacharya) దర్శకత్వం వహించారు.  బొడ్డపాటి (Boddapati) వినాయకుడిగా నటించిన ఈ  చిత్రంలో సత్యభామగా  జమున (Jamuna), రుక్మిణీగా కృష్ణ కుమారి (Krishna Kumari), సత్రాజిత్‌గా గుమ్మడి (Gummadi), శతద్వనుడిగా ఆర్. నాగేశ్వర రావు (R.Nageswara Rao), ప్రసేనుడిగా రాజనాల (Rajanala) నటించారు. నారదుడి పాత్రను కొత్త నటుడు ఏ.ప్రకాశ రావు పోషించారు. 


మద్రాస్ లోని రేవతి స్టూడియోలో వినాయక చవితి చిత్ర నిర్మాణం జరిగింది. శ్రీకృష్ణుడు శమంతక మణి కోసం  వెదుకుతూ వెళ్ళే సన్నివేశం లో దారి పొడవునా ఎలెక్ట్రిక్ పోల్స్ కనిపిస్తాయి. సినిమాలో ఇదొక్కటే లోపం.ఈ చిత్రానికి ఘంటసాల (Ghanta sala) సంగీత దర్శకత్వం వహించారు. సత్రాజిత్ పై చిత్రీకరించిన దినకరా..శుభకర.. దేవా పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అలాగే జయ గణ నాయక సిద్ది వినాయక పాట కూడా. ఈ రెండు పాటలను ఘంటసాల పాడారు.


1957 లో వినాయక చవితి పండుగ కు సరిగ్గా నాలుగు రోజుల ముందు అంటే ఆగస్ట్ 22 న వినాయక చవితి చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో కథ అందరికీ తెలిసిందే .ఏటేటా వినాయకుడి పూజా చేసిన తర్వాత చెప్పించుకొనేదే. అయినా ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందించారు సముద్రాల.ఈ సినిమా తర్వాత సముద్రాల మరో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అవి భక్త రఘునాథ్, బబ్రు వాహన. ఇవి రెండూ పౌరాణికాలే. బబ్రువాహనలో కూడా ఎన్టీఆరే హీరో.

- వినాయకరావు

Updated Date - 2022-08-30T21:08:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!