రేర్ పిక్: ‘హలో బ్రదర్‌’ ఆడియో వేడుకలో దిగ్గజాలు

ABN , First Publish Date - 2022-01-20T23:12:16+05:30 IST

అక్కినేని నాగార్జున, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘హలో బ్రదర్‌’. ఈ సినిమాలో నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. క్లాస్‌ క్యారెక్టర్‌ ఒకటి, మాస్‌ రోల్‌ మరొకటి. హాంకాంగ్‌ యాక్షన్‌ కామెడీ ‘ట్విన్‌ డ్రాగన్స్‌’, ఎన్టీఆర్‌ నటించిన ‘అగ్గిపిడుగు’ చిత్రాల నుంచి స్పూర్తి పొంది ఈ చిత్రం కథ తయారు చేశారు.

రేర్ పిక్: ‘హలో బ్రదర్‌’ ఆడియో వేడుకలో దిగ్గజాలు

అక్కినేని నాగార్జున, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘హలో బ్రదర్‌’. ఈ సినిమాలో నాగార్జున తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశారు. క్లాస్‌ క్యారెక్టర్‌ ఒకటి, మాస్‌ రోల్‌ మరొకటి. హాంకాంగ్‌ యాక్షన్‌ కామెడీ ‘ట్విన్‌ డ్రాగన్స్‌’, ఎన్టీఆర్‌ నటించిన ‘అగ్గిపిడుగు’ చిత్రాల నుంచి స్పూర్తి పొంది ఈ చిత్రం కథ తయారు చేశారు. ఇద్దరు నాగార్జునలు ఒకేసారి తెరపై కనిపించే సన్నివేశాలు ఈ చిత్రంలో కొన్ని ఉన్నాయి. ఆ సీన్లలో నాగార్జునకు హీరో శ్రీకాంత్‌ డూప్‌గా నటించడం విశేషం.


ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా నవ్వించాయో, పాటలు మరింతగా అలరించాయి. ఈవీవీ సినిమా అనగానే సంగీత దర్శకులుగా రాజ్‌–కోటి తప్పనిసరి. ‘దర్శకుడిగా నేను ఫెయిల్‌ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ రాజ్‌–కోటి సంగీతం మాత్రం ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు’ అని ఎన్నోసార్లు ఈ జంట సంగీత దర్శకుల గురించి ప్రశంసించేవారు ఈవీవీ. ‘హలో బ్రదర్‌’ చిత్రంలో ఆరు పాటలు ఉంటే అన్నీ హిట్‌ కావడం విశేషం. ‘హలో బ్రదర్‌’ ఆడియో వేడుకలో  నాగార్జున, సౌందర్య, ఈవీవీలతో పాటు సంగీత దర్శకులు రాజ్‌–కోటిలను ఈ ఫొటోలో చూడవచ్చు. 

–వినాయకరావు


Updated Date - 2022-01-20T23:12:16+05:30 IST