Gundamma Katha: బుల్లెమ్మా - బుల్లోడా- చిట్టెమ్మా

ABN , First Publish Date - 2022-12-18T08:15:22+05:30 IST

విజయావారి ‘గుండమ్మకథ’ (07-06-1962) చిత్రం లోనిది యీస్టిల్‌. అక్కినేని, నందమూరి యిద్దరూ ఇందులో హీరోలే. అయితే విజ్ఞులైన ప్రేక్షకులకు అప్పటికీ, యిప్పటికీ ఒక పెద్ద సందేహం! న్యాయంగా అయితే ఏ సినిమాకైనా కథానాయకుడు ప్రాణం పోస్తాడు.

Gundamma Katha: బుల్లెమ్మా - బుల్లోడా- చిట్టెమ్మా

విజయావారి ‘గుండమ్మకథ’ (Gundamma Katha )(07-06-1962) చిత్రం లోనిది యీస్టిల్‌. అక్కినేని,(ANR) నందమూరి (NTR)యిద్దరూ ఇందులో హీరోలే. అయితే విజ్ఞులైన ప్రేక్షకులకు అప్పటికీ, యిప్పటికీ ఒక పెద్ద సందేహం! న్యాయంగా అయితే ఏ సినిమాకైనా కథానాయకుడు ప్రాణం పోస్తాడు. అయితే యీ చిత్రం ఎన్‌.టి.ఆర్‌, ఏ.ఎన్‌.ఆర్‌.ల హీరోయిజంలో ముందుకు సాగినా, వాళ్లకు అతీతంగా గుండమ్మ (సూర్యకాంతం) పతాకం ఎగురవేయడం విశేషం! సినిమాటైటిల్‌ గుండమ్మ పేరు కావడంతో మొదట్లో కొందరు మొహం చిట్లించుకున్నా, ఏ మాత్రం సంకోచించకుండా ‘నాకు ఓ.కే.’ అని చెప్పి ముందుకు సాగిన వ్యక్తి ఎన్‌.టి.ఆర్‌. ఈ చిత్రంలో ఆయన ఆహార్యమే నవ్వు పుట్టిస్తుంది. అరలాగు, తల పాగా ధరించి గుండమ్మ యింట్లో చేసిన అల్లరి అంతా యింతా కాదు. సంభాషణలు పలికే తీరులో కూడా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారాయన. ఈ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌, సావిత్రి జంటకు ముచ్చట గొలిపే పాటలు కూడా అమరాయి. ఆ పాటలలో ఎన్‌.టి.ఆర్‌. తనదైన శైలిలో విజృంభించి నటించారనడానికి చక్కని ఉదాహరణ ‘కోలుకోలోయన్న’ పాట. ఒక సన్నివేశంలో ఎక్కడో ఉన్న తన తండ్రి భూషయ్య (ఎస్‌.వి.రంగారావు)కు ఉత్తరం రాయమని సావిత్రిని అడగడం, ఉత్తరాన్ని డిక్టేట్‌ చేస్తూ ‘అయ్యోయ్‌’ అని సంబోధించే సరికి సినిమాహాలంతా నవ్వులతో నిండిపోయేది. చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌, సావిత్రిని ‘బుల్లెమ్మా’ అని, హరనాథ్‌ను ‘బుల్లోడా’ అని, జమునను ‘చిట్టెమ్మా’ అని పిలుస్తుండడం కూడా అద్భుతంగా పండింది. (60 years for Gundamma katha)

- డా. కంపల్లె రవిచంద్రన్‌,

98487 20478.

Updated Date - 2022-12-18T10:09:06+05:30 IST