హీరోగా.. ఎస్వీ కృష్ణారెడ్డి తొలి సినిమా ఏదో తెలుసా?

ABN , First Publish Date - 2022-03-03T03:42:35+05:30 IST

దర్శకుడిగా గుర్తింపు పొందిన తర్వాత ‘ఉగాది’ చిత్రంతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకంటే చాలా ఏళ్లకు ముందే కృష్ణారెడ్డి ఓ సినిమాలో హీరోగా నటించారనే సంగతి మీకు తెలుసా? ఆ చిత్రం పేరు..

హీరోగా.. ఎస్వీ కృష్ణారెడ్డి తొలి సినిమా ఏదో తెలుసా?

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. కుటుంబ కథలకు వినోదం జోడించి ఆయన రూపొందించిన చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఎక్కడా క్లాప్ కొట్టకుండా ఆయన డైరెక్ట్‌గా డైరెక్టర్ అయ్యారు. హీరోని కాకుండా కథనే నమ్ముకుని కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రాలు మంచి విజయం సాధించాయి. తను స్వతహాగా సంగీత దర్శకుడు కావడంతో ఆయన సినిమాల్లో పాటలు కూడా ఎప్పుడూ హిట్టే.


దర్శకుడిగా గుర్తింపు పొందిన తర్వాత ‘ఉగాది’ చిత్రంతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే అంతకంటే చాలా ఏళ్లకు ముందే కృష్ణారెడ్డి ఓ సినిమాలో హీరోగా నటించారనే సంగతి మీకు తెలుసా? ఆ చిత్రం పేరు ‘పగడాల పడవ’. 1977 మే 20న కోనసీమలోని ఓ గ్రామంలో ఈ చిత్రం మొదలైంది. అప్పట్లో కృష్ణారెడ్డి పేరు కల్యాణ్. ‘తరం మారింది’ చిత్ర కథానాయిక పల్లవి హీరోయిన్. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో ట్రైనింగ్ అయిన యువి బాబు దర్శకుడు. ఈ సినిమాలో మిగిలిన పాత్రధారులు అంతా కొత్తవారే. హరనాథ్, విజయలలిత మాత్రం పాత వారు. ఘంటసాల పెద్ద కుమారుడు విజయ్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. హీరో, దర్శకుడు, నటీ నటులు, నిర్మాతలు.. అంతా కొత్త వారే కావడంతో పగడాల పడవ ముందుకు నడవలేదు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కిరాతకుడు’ చిత్రంలో ఒక విచిత్రమైన వేషం వేశారు కృష్ణారెడ్డి.

-వినాయకరావుUpdated Date - 2022-03-03T03:42:35+05:30 IST