ఇండస్ట్రీ ‘పెద్ద’ చిరంజీవేనా?

ABN , First Publish Date - 2022-01-13T23:52:23+05:30 IST

దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవేనా?. ఇండస్ట్రీ పెద్ద ఎవరనే విషయంపై నేడు(గురువారం) ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసినట్లేనా? అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. కొన్ని నెలలుగా ఈ పెద్ద దిక్కు విషయంలో..

ఇండస్ట్రీ ‘పెద్ద’ చిరంజీవేనా?

దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవేనా?. ఇండస్ట్రీ పెద్ద ఎవరనే విషయంపై నేడు(గురువారం) ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసినట్లేనా? అంటే అవుననే సమాధానమే వినబడుతోంది. కొన్ని నెలలుగా ఈ పెద్ద దిక్కు విషయంలో టాలీవుడ్‌లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ‘మా’ ఎన్నికలకు ముందు, తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కును నేనే అన్నట్లుగా నిర్మాత, నటుడు మోహన్ బాబు ‘నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు’ అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడబోతున్నట్లుగా ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఓ లేఖాస్త్రం సంధించారు. ఆయన ఆ లేఖను విడుదల చేసి దాదాపు 10 రోజులు గడిచిపోయింది. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు.. కనీసం సీఎంలతో అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లుగా కూడా ఎక్కడా వార్త రాలేదు. 


ఏపీ విషయానికి వస్తే.. మోహన్‌ బాబుకే కాదు, ఇండస్ట్రీకి సంబంధించిన వారెవరికీ ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి డైరెక్ట్‌గా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఎవరు ఏపీ వెళ్లినా.. మంత్రి పేర్ని నానితో మాట్లాడి వచ్చేయడమే తప్ప.. జగన్ వరకు వెళ్లలేదు. ఇప్పుడు స్వయంగా జగన్ మోహన్ రెడ్డే.. చిరంజీవికి ఆహ్వానం పంపి, చర్చించడంతో పాటు సానుకూలంగా బదులివ్వడం చూస్తుంటే.. ఇంకా ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరనే చర్చలు పెట్టడం అనవసరమైన విషయమే. అలాగే తదుపరి చర్చ ఎక్కడ జరుపుదాం అన్నమాటకు.. ‘ఎందుకన్నా.. ఎప్పుడు కలిసినా విందుకే కలుద్దాం’ అని అనడం చూస్తుంటే చిరంజీవికి జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనేది సుస్పష్టమౌతోంది. దీంతో ఇండస్ట్రీ పెద్దలం మేమే అని ప్రకటించుకుంటున్నవారికి ‘పెద్ద’ షాకిచ్చినట్లైందని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కూడా మొదలైంది.

Updated Date - 2022-01-13T23:52:23+05:30 IST