సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

samantha sensational: భర్త కాదు.. మాజీ భర్త!

ABN, First Publish Date - 2022-07-22T14:27:54+05:30

‘కాఫీ విత్‌ కరణ్‌’ (koffee with karan) షోలో సమంత ఏం మాట్లాడనుంది? నాగచైతన్యతో రిలేషన్‌ గురించి ఏం చెబుతోంది అన్న ఆసక్తితో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎపిసోడ్‌ రానే వచ్చింది. సమంత, అక్షయ్‌ కుమార్‌ అతిథులుగా హాజరైన ఈ ఎపిసోడ్‌ గురువారం రాత్రి స్ర్టీమింగ్‌ అయింది. ‘

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కాఫీ విత్‌ కరణ్‌’ (koffee with karan) షోలో సమంత ఏం మాట్లాడనుంది? నాగచైతన్యతో రిలేషన్‌ గురించి ఏం చెబుతోంది అన్న ఆసక్తితో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎపిసోడ్‌ రానే వచ్చింది. సమంత, అక్షయ్‌ కుమార్‌ అతిథులుగా హాజరైన ఈ ఎపిసోడ్‌ గురువారం రాత్రి స్ర్టీమింగ్‌ అయింది. ‘ఊ అంటావా మావ’ అంటూ అక్షయ్‌తో ఎంట్రీ ఇచ్చిన అదరగొట్టిన సామ్‌ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. చైతన్యతో(Naga chaitanya) విడాకుల తర్వాత పరిస్థితి, ట్రోలింగ్‌ గురించి కరణ్‌తో చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా సమాధానమిచ్చారు. మాటల మధ్యలో ‘నీ భర్త’ అని కరణ్‌ అనగా అసలు ఏమాత్రం ఆలోచించకుండా ‘మాజీ భర్త’ అని సమంత కరణ్‌ మాటను సరిచేసింది. (samantha sensational comemnts) 

ప్రస్తుతం చైతూ, సమంత మధ్య ఎటువంటి రిలేషన్‌ ఉందన్న కరణ్‌ ప్రశ్నకు ‘‘మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే.. ఆ గదిలో కత్తులు లాంటి వస్తువులను దాచేయాలి. మా మధ్య అంత స్నేహపూర్వక సంబంధాలు లేవు. భవిష్యత్తులో పరిస్థితి ఫ్రెండ్లీగా ఉంటుందేమో చెప్పలేను. ప్రస్తుతానికి మా ఇద్దరి మధ్య రిలేషన్‌ ఇదే’’ అని సమంత చెప్పారు. విడాకుల అనంతరం 250 కోట్లు భరణం తీసుకున్నాననీ, పెళ్లికి ముందు అగ్రిమెంట్‌ రాసుకోవడం వల్ల భరణం రాలేదని ఇలా.. ఏవేవో రాతలు, ట్రోలింగ్‌ చూశాను. నేను చదివిన గాసిప్పులో ఇవే చెత్తవి. విడాకుల వల్ల నేనేమీ అప్‌సెట్‌ కాలేదు’’ అని సామ్‌ చెప్పుకొచ్చారు. (Samantha ex husbend)


అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మళ్లీ ఇద్దరూ కలవాలని కోరుకున్నారు. అయితే ఇప్పుడు సమంత మాటలను బట్టి ఇద్దరి మధ్య చాలా జరిగిందనే తెలుస్తోంది. ‘మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే.. ఆ గదిలో కత్తులు లాంటి వస్తువులను దాచేయాలి’ అని సమంత అంటోంది అంటే ఇద్దరి మధ్య వార్‌ గట్టిదనే అర్థమవుతోంది.  


Updated Date - 2022-07-22T14:27:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!