‘భీమ్లానాయక్’పై జగన్ సర్కారు కక్ష తీర్చుకోనుందా?
ABN , First Publish Date - 2022-02-18T00:42:58+05:30 IST
పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందా? పవన్‌కల్యాణ్ పై కక్ష సాధింపు కొనసాగించనుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ రాజకీయ వర్గాలు. ప్రస్తుతం అన్ని చోట్ల ఇదే టాపిక్ నడుస్తోంది. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ‘భీమ్లా నాయక్’ చిత్రం విడుదల విషయంలో ఏపీ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందా? పవన్‌కల్యాణ్ పై కక్ష సాధింపు కొనసాగించనుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ రాజకీయ వర్గాలు. ప్రస్తుతం అన్ని చోట్ల ఇదే టాపిక్ నడుస్తోంది. పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చాలాకాలంగా ఏపీలో టికెట్ రేట్ల పెంపు చర్చ నడుస్తోంది. గురువారం జరిగిన నాలుగో సమావేశంతో ఈ చర్చ ఓ కొలిక్కి వచ్చినప్పటికీ పెంచిన టికెట్ రేట్లు ఎప్పటికి అమలులోకి వస్తాయనేది క్లారిటీ ఇవ్వలేదు. ఫైనల్‌గా మరోసారి కమిటీ చర్చలు నిర్వహించే అవసరం ఉందనే వార్తలు వస్తున్నాయి.
సినిమా టికెట్ రేట్లు పెంచడం పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసినప్పటికీ.. విడుదలకు సిద్ధమైన ‘భీమ్లానాయక్’ బృందం మాత్రం ఆనందంగా లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచారు కానీ.. దానిని అమలులోకి తెచ్చే జీవో ఇంకా రాలేదు. ఈ నెలాఖరులో వస్తుందని, మార్చి మొదటివారం నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని చెబుతున్నారు. అయితే ఈ నెల 25న ‘భీమ్లానాయక్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. అదే కనుక జరిగితే ఏపీలో ‘భీమ్లానాయక్’కు అన్యాయం జరిగినట్లే. పవన్‌కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వానికి ఉన్న కక్షే దీనికి కారణమని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తేయడం, 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడం సినిమాకు ప్లస్ అనే చెప్పాలి.
ఈ నెల 21న ‘భీమ్లానాయక్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. గతంలో పవన్‌కల్యాణ్ ఓ వేడుకలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ ఎలా స్పందిస్తారో అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఏం జరగబోతోంది అన్నది చూడాలి.