Rajinikanth: మణిరత్నం దర్శకత్వంలో సూపర్‌స్టార్‌?.. 32 ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2022-10-14T15:39:31+05:30 IST

దర్శక దిగ్గజం మణిరత్నం (Maniratnam), సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) కాంబినేషన్‌లో సుధీర్ఘకాలం తర్వాత ఒక చిత్రం రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది..

Rajinikanth: మణిరత్నం దర్శకత్వంలో సూపర్‌స్టార్‌?.. 32 ఏళ్ల తర్వాత..

దర్శక దిగ్గజం మణిరత్నం (Maniratnam), సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) కాంబినేషన్‌లో సుధీర్ఘకాలం తర్వాత ఒక చిత్రం రానున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కలయికలో 32 ఏళ్ల క్రితం ‘దళపతి’ (Thalapathi) సినిమా వచ్చింది. ఆ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించింది. మరోమారు వీరిద్దరు కలిసి పనిచేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే మణిరత్నం చెప్పిన కథకు రజనీకాంత్‌ అంగీకరించారని తెలుస్తోంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) నిర్మించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’పై దృష్టిని కేంద్రీకరించగా.. రజనీకాంత్‌ ‘జైలర్‌’  షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్‌లో మూవీని పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దాంతో.. ఈ వార్తలు నిజమవ్వాలని ఈ వారి అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - 2022-10-14T15:39:31+05:30 IST