ఎవరైనా రవితేజ గురించి అడిగితే.. నేనదే చెబుతా: కోట (పార్ట్ 66)
ABN , First Publish Date - 2022-07-01T01:07:52+05:30 IST
అంతకు ముందు కూడా చిరంజీవి (Chiranjeevi)గారి ‘అన్నయ్య’ (Annayya) తో పాటు ఏడెనిమిది సినిమాలు రవితేజ (Ravi Teja)తో చేశాను కానీ ‘ఇడియట్’ (Idiot) చూశాక నాకు రవితేజ అంటే ఏంటో తెలిసింది. మంచి ఈజ్ ఉన్నటువంటి..

అంతకు ముందు కూడా చిరంజీవి (Chiranjeevi)గారి ‘అన్నయ్య’ (Annayya) తో పాటు ఏడెనిమిది సినిమాలు రవితేజ (Ravi Teja)తో చేశాను కానీ ‘ఇడియట్’ (Idiot) చూశాక నాకు రవితేజ అంటే ఏంటో తెలిసింది. మంచి ఈజ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్. టిపికల్‌గా ఉంటుంది తన స్టైల్. అతని వాయిస్ గమ్మత్తుగా ఉంటుంది. డైలాగులు చెప్పడంలో తనకంటూ ఓ స్టైల్ ఉంటుంది. ఆ వెటకార ధోరణిని సినిమా సినిమాకూ చాలా పెక్యూలియర్‌గా మార్చుకుంటూ ఎక్కడా బోర్ కొట్టనీయకుండా, మొనాటనీ రానీయకుండా జాగ్రత్తగా వెళ్తున్నాడు. ఆ మధ్య రవితేజతో ‘మిరపకాయ్’, ‘షాక్’ అని రెండు చిత్రాలు హరీశ్ దర్శకత్వంలో చేశా. ఆ తర్వాత కూడా చాలా చేశా. అతనిలో నాకు బాగా నచ్చింది ఫ్రాంక్‌నెస్. సెట్లో సరదాగా ఉంటాడు. రవితేజ సెట్లో ఉంటే మొత్తం సందడి సందడిగా ఉంటుంది. పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ తో అందరూ కళకళలాడుతుంటారు. ఇవన్నీ నేను అతనిలో అబ్జర్వ్ చేసిన విషయాలు.
అందుకే ఎవరైనా రవితేజ గురించి అడిగితే ‘హుషారైన కుర్రాడు’ అని చెబుతా. అతను పెద్దవాళ్ళతో రెస్పెక్ట్ గా మాట్లాడుతాడు. వీటన్నిటితోపాటు అతనికి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం.. అతను అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)గారికి ఫ్యాన్. రవితేజ కొన్నాళ్ళు హిందీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ, కో డైరెక్టర్‌గానూ పనిచేసి వచ్చాడుగా.. కారణం అదో, మరేమిటో తెలియదుగానీ అతనికి అమితాబ్‌గారంటే చాలా ఇష్టం. నేను అమితాబ్‌బచ్చన్‌తో కలిసి సినిమా చేశానని తెలిసి చాలా ఆనందపడ్డాడు. ‘బాబాయ్.. మంచి మార్కులు సంపాదించుకున్నావ్.. హిందీలోనూ మంచి పేరు తెచ్చుకున్నావు. అమితాబ్‌గారితో చేశావ్’ అని సంబరంగా అన్నాడు. ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే రవితేజ చూడ్డానికి ఒక యాంగిల్‌లో అమితాబ్‌లాగా ఉంటాడు. నేను ఒకట్రెండుసార్లు ఈ విషయం అతనితో కూడా అన్నాను. కొన్ని రకాల హెయిర్‌స్టైల్‌లో అలా ఉంటాడని అతనితో కూడా అంతకు ముందు చాలా మంది చెప్పారట.
(ఇంకా ఉంది)
-డా. చల్లా భాగ్యలక్ష్మి

Read more