Rajkiran: ఆమె నా కుమార్తె కాదు...
ABN, First Publish Date - 2022-09-09T17:14:29+05:30
కోలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌కిరణ్(Kollywood senior actor Rajkiran) తన పెంపుడు కుమార్తె విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన
- నటుడు రాజ్‌కిరణ్
అడయార్(చెన్నై), సెప్టెంబరు 8: కోలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌కిరణ్(Kollywood senior actor Rajkiran) తన పెంపుడు కుమార్తె విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తన పెంపుడు కుమార్తె ప్రియ బుల్లితెర నటుడిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు. ‘‘వాస్తవానికి తన రక్తం పంచుకుని పుట్టింది ఒకే ఒక్క కుమారుడు. అతని పేరు టిప్పుసుల్తాన్ అలియాస్ నైనార్. అయితే, ప్రియ అనే యువతిని పెంచుకున్నాం. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఆమెను పెంచాం. కానీ, ఇపుడు ఆమె టీవీ సీరియల్ నటుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వాస్తవానికి తక్కువ కులం లేదా ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించివుంటే ఖచ్చితంగా వివాహం చేసేవాళ్ళం. కానీ, డబ్బు కోసం మోసాలకు పాల్పడే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అందువల్ల వారితో మాకు సంబంధం లేదు’’ అని రాజ్‌కిరణ్ తన ఫేస్బుక్(Facebook) ఖాతాలో గురువారం ఒక పోస్ట్‌లో స్పష్టం చేశారు.