Mothers Day: మాతృ దినోత్సవం.. సినీ తారలు ఏమన్నారంటే!

ABN , First Publish Date - 2022-05-08T21:44:23+05:30 IST

ఆదివారం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని భూమ్మీద ఉన్న మాతృమూర్తులందరికీ మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి నటిస్తున్న గాడ్‌ ఫాదర్‌, పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’ చిత్రాల షూటింగ్‌ ఒకే లొకేషన్‌లో జరుగుతున్న సందర్భంలో నాగబాబు, అంజనాదేవి సెట్‌కి వెళ్లి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు.

Mothers Day: మాతృ దినోత్సవం.. సినీ తారలు ఏమన్నారంటే!

ఆదివారం మాతృదినోత్సవాన్ని (Mothers day) పురస్కరించుకుని భూమ్మీద ఉన్న మాతృమూర్తులందరికీ మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి నటిస్తున్న గాడ్‌ ఫాదర్‌, పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan)‘భీమ్లానాయక్‌’ చిత్రాల షూటింగ్‌ ఒకే లొకేషన్‌లో జరుగుతున్న సందర్భంలో నాగబాబు (Nagababu), అంజనాదేవి సెట్‌కి వెళ్లి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. అంజనాదేవి, చిరు, నాగబాబు, పవన్‌కల్యాణ్‌ కలిసి సరదాగా భోజనం చేశారు. ఆ ప్రత్యేకమైన వీడియోను చిరంజీవి షేర్‌ చేశారు. 


సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV) కూడా తన తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను మంచి కొడుకును కాదు.. కానీ నువ్వు చాలా మంచి అమ్మవి’ అని రాసుకొచ్చారు. 


అన్‌ కండీషనల్‌ లవ్‌కు నిర్వచనం అమ్మ అని రకుల్‌ (Rakul preeth singh)పేర్కొన్నారు.


‘అమ్మా నువ్వు మా మధ్య లేవు.. కానీ నీ జ్ఞాపకాలతో నీ ప్రేమను పొందుతూనే ఉన్నాం’ అలని శ్రీదేవిని ఉద్దేశించి జాన్వీకపూర్‌ (Janhvey kapoor) పోస్ట్‌ చేశారు. 


మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌(Mohanlal), అడివి శేష్‌(Adivi sesh), వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఆండ్రియా తదితరులు తల్లితో తమకున్న అనుబంధాన్ని షేర్‌ చేసుకున్నారు. 


























Updated Date - 2022-05-08T21:44:23+05:30 IST