Mission: Impossible: మూవీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టంట్!

ABN , First Publish Date - 2022-12-21T16:56:47+05:30 IST

‘మిషన్ ఇంపాజిబుల్: ది డెడ్ రెకనింగ్ పార్ట్ 1’ కోసం టామ్ క్రూజ్ సాహసోపేతమైన స్టంట్స్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోను హీరో సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు.

Mission: Impossible: మూవీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టంట్!

డేర్ డెవిల్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise). ‘టాప్ గన్’, ‘నైట్ అండ్ డే’, ‘ది మమ్మీ’ చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. టామ్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission: Impossible). ఇథన్ హంట్ అనే స్పై ఏజెంట్‌ పాత్రను పోషించాడు. 1996లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఫలితంగా మేకర్స్ ఈ ప్రాజెక్టును ప్రాంచైజీగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆరు భాగాలుగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఏడో భాగం ‘మిషన్ ఇంపాజిబుల్: ది డెడ్ రెకనింగ్ పార్ట్ 1’ (Mission Impossible – Dead Reckoning Part 1) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జులై 14న విడుదల కానుంది.

‘మిషన్ ఇంపాజిబుల్: ది డెడ్ రెకనింగ్ పార్ట్ 1’ కోసం టామ్ క్రూజ్ సాహసోపేతమైన స్టంట్స్ చేస్తున్నాడు. ఈ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోను హీరో సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టంట్‌ అని మేకర్స్ అభివర్ణిస్తున్నారు. మోటర్ సైకిల్‌ను డ్రైవ్ చేస్తూ పర్వత శిఖరం మీద నుంచి దూకాడు. ఈ స్టంట్ కోసం ఏడాది పాటు శిక్షణ తీసుకున్నాడు. ప్రతి రోజు మోటోక్రాస్‌ ట్రైనింగ్‌తో పాటు 30బేస్ జంప్స్, 500స్కై డైవింగ్స్ చేశాడు. సినిమాలో షాట్‌‌ కోసం టామ్ క్రూయిజ్ ఒకే రోజు 6టేక్స్ తీసుకున్నాడు. ఈ స్టంట్ ప్రేక్షకులను అబ్బురపరిచింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ ప్రియులందరు షేర్ చేయడం మొదలుపెట్టారు.

Updated Date - 2023-10-27T14:49:19+05:30 IST