Tom Cruise: అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు.. విమానంలోంచి దూకిన 60 ఏళ్ల హాలీవుడ్ స్టార్

ABN , First Publish Date - 2022-12-19T12:31:01+05:30 IST

‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise). 60 ఏళ్ల వయస్సులోనూ సినిమాల్లో రియలిస్టిక్ స్టంట్స్ చేస్తూ అలరిస్తుంటాడు.

Tom Cruise: అభిమానులకు ధన్యవాదాలు తెలిపేందుకు.. విమానంలోంచి దూకిన 60 ఏళ్ల హాలీవుడ్ స్టార్
Tom Cruise

‘మిషన్ ఇంపాజిబుల్’ (Mission Impossible) చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు టామ్ క్రూజ్ (Tom Cruise). 60 ఏళ్ల వయస్సులోనూ సినిమాల్లో రియలిస్టిక్ స్టంట్స్ చేస్తూ అలరిస్తుంటాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘టాప్ గన్: మావెరిక్’ (Top Gun Maverick) ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. 2022లో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ తరుణంలో అభిమానులకు డిఫరెంట్‌గా ధన్యవాదాలు చెబుతూ టామ్ ఓ వీడియోని విడుదల చేశాడు.

tom.jpg

అందులో.. ‘‘మా సినిమా ‘టాప్ గన్: మావెరిక్’ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. కరోనా తర్వాత థియేటర్స్‌కి వచ్చి సినిమాకి మద్దతు చేసినందుకు చాలా థ్యాంక్స్. మేము ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ‘టాప్ గన్: డెడ్ రికనింగ్’ పార్ట్ 1, 2 షూటింగ్‌ చేస్తున్నాం. ప్రస్తుతం సెలవులో ఉన్నాను. కానీ.. మీకు ధన్యవాదాలు చెప్పకుండా ఈ సంవత్సారాన్ని ముగించాలని అనుకోలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో ఈ సినిమాల దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కూడా ఉన్నాడు. ఈ వీడియోలో ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. దీంతో ఇది చూసిన ఆయన అభిమానులు టామ్ ఫ్యాన్స్‌కి ఇచ్చే గౌరవం గురించి కామెంట్స్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2022-12-19T12:31:04+05:30 IST