Year Ender 2022: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ సినిమాలు

ABN , First Publish Date - 2022-12-26T20:38:50+05:30 IST

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌతిండియన్‌తో పాటు హాలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. కొన్ని ప్రాజెక్టులైతే హిందీ మూవీస్‌ని మించి రాణించాయి.

Year Ender 2022: బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ సినిమాలు

బాలీవుడ్ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేదు. బాక్సాఫీస్ వద్ద విడుదలైన అనేక సినిమాలు పరాజయాన్ని చవి చూశాయి. స్టార్ హీరోల చిత్రాలకు కూడా చుక్కెదురైంది. భాష, జోనర్‌తో సంబంధం లేకుండా కంటెంట్ బాగున్న మూవీస్‌ను ప్రేక్షకులు ఆదరించారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌతిండియన్‌తో పాటు హాలీవుడ్ చిత్రాలు భారీ వసూళ్లను రాబట్టాయి. కొన్ని ప్రాజెక్టులైతే హిందీ మూవీస్‌ని మించి రాణించాయి. అయితే, ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టిన హాలీవు్డ్ సినిమాలపై ఓ లుక్కేద్దామా మరి..

The-Batman.jpg

ది బ్యాట్ మ్యాన్ (The Batman):

రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా నటించిన సినిమా ది బ్యాట్‌మ్యాన్ (The Batman). మార్చిలో ఈ చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లను రాబట్టింది. ఇండియాలో ఈ మూవీ రూ.49కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కొన్ని బాలీవుడ్ సినిమాల కంటే ఈ వసూళ్లు అధికం కావడం విశేషం.

Jurassic-Park-World-Dominio.jpg

జురాసిక్ పార్క్: వరల్డ్ డామినియన్ (Jurassic Park: World Dominion):

జురాసిక్ పార్క్ ప్రాంచైజీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంచైజీలో వచ్చిన సినిమా జురాసిక్ పార్క్: వరల్డ్ డామినియన్. జూన్ 10, 2022న రిలీజ్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిష్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇండియాలో రూ.68.56కోట్ల వసూళ్లను రాబట్టింది. అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్ సినిమా కంటే ఈ వసూళ్లు ఎక్కువ కావడం గమనార్హం.

Top-Gun-Maveric.jpg

టాప్ గన్ మావెరిక్ (Top Gun Maveric):

టామ్ క్రూజ్ హీరోగా నటించిన సినిమా టాప్ గన్ (Top Gun). ఈ చిత్రానికి సీక్వెల్ రెండు దశాబ్దాల తర్వాత ‘టాప్ గన్ మావెరిక్’ టైటిల్‌తో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మే 27, 2022న విడుదల అయింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో ఈ చిత్రం రూ.48కోట్ల వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలన విజయం సాధించింది. 1.4 బిలియన్ డాలర్స్‌కు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

Doctor-Strange-in-the-Multi.jpg

డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్ (Doctor Strange in the Multiverse of Madness):

మార్వెల్స్ నుంచి 2016లో వచ్చిన సినిమా డాక్టర్ స్ట్రేంజ్. ఈ చిత్రానికి సీక్వెల్ ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవెర్స్ ఆఫ్ మాడ్‌నెస్’ టైటిల్‌తో తెరకెక్కింది. బెన్‌డిక్ట్ కంబర్ బ్యాచ్ (Benedict Cumberbatch) హీరోగా నటించాడు. ‘స్పైడర్ మ్యాన్’ చిత్రాల దర్శకుడు సామ్ రైమీ తెరకెక్కించాడు. ఈ మూవీ మే 6న విడుదల అయింది. ఇండియాలో రూ.129కోట్ల వసూళ్లను రాబట్టింది.

Avatar-The-Way-Of-Water.jpg

అవతార్: ది ఆఫ్ వాటర్ (Avatar: The Way Of Water):

‘టైటానిక్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్2’ (Avatar2). ఈ సినిమా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల అయింది. 2009లో విడుదలైన ‘అవతార్’ (Avatar)కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఫార్మాట్స్‌లో 160భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం.

Updated Date - 2022-12-26T20:42:03+05:30 IST