Avatar: The Way Of Water: సినిమాకు షాకిచ్చిన తమిళనాడు థియేటర్స్

ABN , First Publish Date - 2022-12-16T19:56:28+05:30 IST

జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన సినిమా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water). దాదాపుగా రూ.16వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా 160భాషల్లో రిలీజ్ అయింది.

Avatar: The Way Of Water: సినిమాకు షాకిచ్చిన తమిళనాడు థియేటర్స్

జేమ్స్ కామెరూన్ (James Cameron) దర్శకత్వం వహించిన సినిమా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way Of Water). దాదాపుగా రూ.16వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా 160భాషల్లో రిలీజ్ అయింది. అందుబాటులో ఉన్న అన్ని ఫార్మాట్స్‌లో చిత్రాన్ని విడుదల చేశారు. ఇండియాలో ఈ చిత్రం 3,800 స్క్రీన్స్‌లో విడుదల అయింది. కానీ, తమిళనాడులోని థియేటర్ ఓనర్స్ మాత్రం ‘అవతార్‌2’ (Avatar2) కు షాకిచ్చారు. ఆ రాష్ట్రంలోని 70శాతానికి పైగా ఎగ్జిబిటర్స్ ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి నిరాకరించారు. ‘అవతార్’ డిస్ట్రిబ్యూటర్ డిస్నీ పెడుతున్న షరతులకు థియేటర్ ఓనర్స్ ససేమిరా అన్నారు. సినిమాను ప్రదర్శించడానికి అంగీకరించలేదు.

అవతార్‌2 సినిమాకు వచ్చే కలెక్షన్స్‌లో 70శాతం షేర్ ఇవ్వాలని డిస్నీ.. ఎగ్జిబిటర్స్‌ను కోరింది. గతంలో ఏ హాలీవుడ్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంత షేర్‌ను కోరలేదు. చిత్రానికి వచ్చే రెవెన్యూ నుంచి 60శాతం ఇవ్వడానికి థియేటర్ ఓనర్స్ అంగీకరించారు. కానీ, డిస్నీ మాత్రం 70శాతం షేర్ ఇవ్వాలని పట్టుబడింది. కొన్ని చోట్ల దిగివచ్చి 65శాతం షేర్ తీసుకోవడానికి ఒప్పుకొంది. 70శాతం షేర్ ఇస్తే తమకు గిట్టు బాటు కాదని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. డిస్నీ షరతులకు అంగీకరించిన 300స్క్రీన్స్‌‌లో అవతార్‌ను ప్రదర్శిస్తున్నారు. మిగిలిన థియేటర్స్ కూడా అదే బాటలో నడవాలని డిస్నీ కోరుతుంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-12-16T19:57:43+05:30 IST