Avatar2: టిక్కెట్ సేల్స్‌లో చైనా, అమెరికా‌లతో పోటీపడుతున్న ఇండియా

ABN , First Publish Date - 2022-12-18T15:36:20+05:30 IST

జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water). 2009లో విడుదలైన ‘అవతార్‌’ (Avatar)కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది.

Avatar2: టిక్కెట్ సేల్స్‌లో చైనా, అమెరికా‌లతో పోటీపడుతున్న ఇండియా

జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water). 2009లో విడుదలైన ‘అవతార్‌’ (Avatar)కు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. దాదాపుగా 13ఏళ్ల తర్వాత మూవీ వస్తుండటంతో చిత్రంపై భారీ బజ్ ఉంది. ‘అవతార్2’ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండటంతో భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. రిలీజ్ డే నాడు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 180మిలియన్ డాలర్స్‌ను రాబట్టింది. ఇండియాలో కూడా చిత్రం అద్భుతమైన కలెక్షన్స్‌ను సాధిస్తుంది. తొలిరోజు భారత్‌లో ఆరు మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది. టిక్కెట్ సేల్స్‌లో మాత్రం అమెరికా, చైనాలతో ఇండియా పోటీపడుతుంది.

‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అమెరికాలో 53మిలియన్ డాలర్స్, చైనాలో 24మిలియన్ డాలర్స్, జర్మనీలో 8.6మిలియన్ డాలర్స్, దక్షిణ కొరియాలో 9.8మిలియన్ డాలర్స్, ఫ్రాన్స్‌లో 9.5మిలియన్ డాలర్స్, జర్మనీలో 8.6మిలియన్ డాలర్స్, ఇండియాలో 6మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది. ఈ సినిమాను అమెరికాలో 15వేల స్క్రీన్స్‌లో విడుదల చేయగా 26లక్షల టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. చైనాలో 45వేల స్క్రీన్స్‌లో రిలీజ్ చేయగా 25.5లక్షల టిక్కెట్స్, భారత్‌లో 4వేల స్క్రీన్స్‌లో విడుదల చేయగా 23లక్షల టిక్కెట్స్ బాక్సాఫీస్ వద్ద తెగాయి. మాములుగా హాలీవుడ్ చిత్రాలకు అమెరికా, చైనాలో మంచి మార్కెట్ ఉంటుంది. కానీ, ‘అవతార్‌2’ పై భారీ బజ్ ఉండటంతో ఇంటర్నేషనల్ మార్కెట్స్‌తో భారత్ పోటీపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాకు ఎగ్జిబిటర్స్ నుంచి చుక్కెదురైంది. డిస్ట్రిబ్యూటర్స్ 70శాతం రెవెన్యూ షేర్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో థియేటర్ ఓనర్స్ అవతార్‌ను ప్రదర్శించేందుకు నిరాకరించారు. తమకు గిట్టుబాటు కాదని తెగేసి చెప్పారు.

Updated Date - 2022-12-18T15:37:32+05:30 IST