సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వాటర్‌లో... వండర్‌

ABN, First Publish Date - 2022-12-17T00:53:53+05:30

ఎన్నో అంచనాల మధ్య ‘అవతార్‌ - ద వే ఆఫ్‌ వాటర్‌’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నో అంచనాల మధ్య ‘అవతార్‌ - ద వే ఆఫ్‌ వాటర్‌’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రూ.15 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. ఆశించినట్టుగానే తెలుగునాట ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ లభించాయి. గతంలో ఏ హాలీవుడ్‌ అనువాద చిత్రానికీ రానన్ని ప్రారంభ వసూళ్లు ‘అవతార్‌’ దక్కించుకొందనేది ట్రేడ్‌ వర్గాల టాక్‌. తొలి రోజు తెలుగులో కనీసం రూ.8 కోట్లు రావొచ్చనేది ఓ అంచనా. దేశ వ్యాప్తంగా ఇంచుమించు ఇలాంటి స్పందనే వస్తోంది. మల్టీపెక్స్‌లలో ‘అవతార్‌ 2’ హవా ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా త్రీడీ వెర్షన్‌లో ఈ సినిమాని చూడ్డానికి అభిమానులు ఆసక్తి చూపించారు. హైదరాబాద్‌ ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లోని బిగ్‌ స్ర్కీన్‌కి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. త్రీడీ టికెట్లు బ్లాకులో కొనుక్కొని మరీ చూస్తున్నారని టాక్‌. పోటీగా ఏ తెలుగు చిత్రమూ లేకపోవడంతో.. ‘అవతార్‌’కి ఎదురు లేకుండా పోయింది. 3 గంటల 10 నిమిషాల నిడివితో సాగిన చిత్రమిది. సాగర గర్భంలో చూపించిన విజువల్స్‌.. ‘వావ్‌’ అనిపించేలా ఉన్నాయి. దాదాపు 30 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్‌ ఈ చిత్రానికి ఆయువు పట్టు. యుద్ధ నేపథ్యంలో సాగే పతాక సన్నివేశాల్లో జేమ్స్‌ కెమెరూన్‌ అద్భుత ప్రతిభాపాటవాల్ని చూపించాడు. విజువల్‌ పరంగా ఈ చిత్రం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉందో.. భావోద్వేగాల పరంగానూ అంతే ప్రాధాన్యం సంపాదించుకొంది. నీటి విశిష్టతను చెబుతూ రాసుకొన్న సంభాషణలు తాత్విక ధోరణిలో సాగి ఆకట్టుకొంటాయి. మన పురాణ ఇతిహాసాల ప్రభావం ‘అవతార్‌ 2’పై ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కథానాయకుడు జేక్‌ తన రాజ్యాన్ని వదిలి, మరో చోటకి వలస పోవడం రామాయణంలోని అరణ్యవాసాన్ని పోలి ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. నాయకా నాయికల పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం, ఓ సైన్స్‌ ఫిక్షన్‌ కథలో ఎమోషన్లని మేళవించిన పద్ధతి.. ‘అవతార్‌ 2’ని మరింత ప్రత్యేకంగా మలిచాయి. సినీ ప్రేమికులకు ‘అవతార్‌ 2’ ఓ పండగలాంటిదే. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సరికొత్త రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-12-17T07:39:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!