Avatar 2: రికార్డు నెలకొల్పిన ‘అవతార్ 2’ .. అత్యంత వేగంగా..

ABN , First Publish Date - 2022-12-29T16:24:39+05:30 IST

జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar 2). ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో విడుదలైన ‘అవతార్’ (Avatar) కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది.

Avatar 2: రికార్డు నెలకొల్పిన  ‘అవతార్ 2’ .. అత్యంత వేగంగా..

జేమ్స్ కామెరూన్ (James Cameron) నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్ 2’ (Avatar 2). ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో విడుదలైన ‘అవతార్’ (Avatar) కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదల అయింది. అందుబాటులో ఉన్న అన్ని పార్మాట్స్‌లో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ‘అవతార్‌ 2’ పై భారీ బజ్ ఉండటంతో సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ‘అవతార్ 2’ తాజాగా చరిత్రను సృష్టించింది.

అత్యంత వేగంగా వన్ బిలయన్ డాలర్స్‌ కలెక్షన్స్‌ను సాధించిన చిత్రంగా ‘అవతార్ 2’ రికార్డును నెలకొల్పింది. ఇండియాలో ఈ సినిమా రెండు వారాల్లోపే రూ.350కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం. ‘టాప్ గన్: మావెరిక్’, ‘జురాసిక్ వరల్డ్ డామినియన్’ ఈ ఏడాది వన్ బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టాయి. అయితే, అత్యంత వేగంగా వన్ బిలయన్ డాలర్స్‌ కలెక్షన్స్‌ను సాధించిన చిత్రంగా ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ పేరిట గతంలో రికార్డు ఉండేది. ‘స్పైడర్ మ్యాన్’ చిత్రం ఆ స్థాయి వసూళ్లను 12రోజుల్లో రాబట్టింది. కానీ, ‘అవతార్ 2’ మాత్రం అంతకంటే తక్కువ సమయంలోనే భారీ కలెక్షన్స్‌ను సాధించడం చెప్పుకోదగ్గ విశేషం. ‘అవతార్’ 2009లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 2.97బిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ‘అవతార్ 2’ లో శామ్ వర్తింగ్‌టన్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్‌స్లేట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-12-29T16:30:03+05:30 IST