Chiranjeevi : మాస్ దర్శకుడితో మూడోసారి?

ABN , First Publish Date - 2022-06-19T18:19:04+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్ (Godfather), భోళాశంకర్ (Bholashankar), వాల్తేరు వీరయ్య’ (Waltair veerayya) చిత్రాల్లో ఏకకాలంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

Chiranjeevi : మాస్ దర్శకుడితో మూడోసారి?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్ (Godfather), భోళాశంకర్ (Bholashankar), వాల్తేరు వీరయ్య’ (Waltair veerayya) చిత్రాల్లో ఏకకాలంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలోనూ ఓ సినిమాచేయబోతున్నారు చిరు. ఆల్రెడీ దానికి సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టు సమాచారం. వీటితో పాటు చిరంజీవి మాస్ దర్శకుడు వివివినాయక్ (VVVinayak) దర్శకత్వంలో మూడో చిత్రంలో నటించబోతున్న వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. 


టాలీవుడ్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ వినాయక్. టాలీవుడ్ లోని అగ్ర కథానాయికులందరికీ వినాయక్ సూపర్ హిట్స్ ఇచ్చారు. చిరంజీవితో తెరకెక్కించిన ‘ఠాగూర్ (Tharoge), ఖైదీనెంబర్ 150 (Khaidi Number 150)’ చిత్రాలు చిరు కెరీర్ లోనే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేశాయి. ఈ క్రమంలో వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి మరో యాక్షన్ చిత్రాన్ని చేయబోతున్నట్టు వినికిడి. ఈ సినిమాకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. చిరంజీవి అభిమాని అయిన వినాయక్.. చిరును ఏ స్థాయిలో చూపిస్తే ఎలివేట్ చేయాలో బాగా తెలుసు. అందుకే వినాయక్ పై చిరుకు విపరీతమైన నమ్మకం. 


ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా.. బాలీవుడ్ లో ఛత్రపతి (Chatrapathi) రీమేక్ వెర్షన్ తెరకెక్కిస్తు్న్న వినాయక్.. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే..  తనే హీరోగా ఎంట్రీ ఇస్తూ ఓ సినిమాలో నటించబోతున్నారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. చిరంజీవితో చేయబోయే చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ ను ప్రారంభించబోతున్నట్టు టాక్. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. వినాయక్ చివరిగా సాయిధరమ్ తేజ్ (Saidharamtej) హీరోగా ‘ఇంటిలిజెంట్’ (Intelligent) అనే మూవీ తెరకెక్కించాడు. ఈ సినిమా పరాజయం పాలైంది. ఆ చిత్రం తర్వాత మళ్లీ వినాయక్ తెలుగులో చేయబోయేది చిరంజీవి చిత్రమే అని సమాచారం. మరి ఈ సినిమాతో చిరు, వినాయక్ హ్యాట్రిక్  హిట్ ఇస్తారేమో చూడాలి.  

Updated Date - 2022-06-19T18:19:04+05:30 IST

Read more