సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

త్రివిక్రమ్ దర్శకత్వంలో రౌడీ హీరో?

ABN, First Publish Date - 2022-03-22T14:19:09+05:30

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. దీని తర్వాత నిజానికి సుకుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా తెరకెక్కాలి. కానీ సుక్కూ ప్రస్తుతం ‘పుష్ప 2’తో ఫుల్ బిజీగా ఉండడంతో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతోందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త గా త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో నటించబోతన్నాడట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. దీని తర్వాత నిజానికి సుకుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా తెరకెక్కాలి. కానీ సుక్కూ ప్రస్తుతం ‘పుష్ప 2’తో ఫుల్ బిజీగా ఉండడంతో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కాబోతోందని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త గా త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో నటించబోతన్నాడట. 


విజయ్‌తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్న దర్శకులు ఆయన్ని సంప్రదిస్తే.. త్రివిక్రమ్‌తో సినిమా పూర్తయ్యాకా చూద్దాం అంటున్నాడట. మహేశ్‌బాబుతో సినిమా పూర్తయ్యాకా త్రివిక్రమ్ చేయబోయేది విజయ్ దేవరకొండతోనే అని సమాచారం. అయితే ఈ గ్యాప్‌లో శివ నిర్వాణ సినిమా పట్టాలెక్కిస్తాడా లేక పూరి దర్శకత్వంలోనే ‘జనగణమన’ చిత్రాన్ని మొదలు పెడతాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయడం  ఎవరూ ఊహించనిది అని చెప్పుకోవాలి. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-03-22T14:19:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!