సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దళపతి విజయ్ తెలుగు సినిమా లాంచింగ్ అప్పుడేనా?

ABN, First Publish Date - 2022-01-28T17:55:34+05:30

తమిళ దళపతి విజయ్ తెలుగులో ఓ స్ట్రైట్ మూవీకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సినిమా నిర్మాణం జరుపుకోనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులవుతున్నా.. ఇంత వరకూ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్టేడ్ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా హడావిడిలో ఉన్న విజయ్.. వచ్చే నెల్లో ఈ సినిమా డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేస్తాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ దళపతి విజయ్ తెలుగులో ఓ స్ట్రైట్ మూవీకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో సినిమా నిర్మాణం జరుపుకోనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్..  అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి చాలా రోజులవుతున్నా.. ఇంత వరకూ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్టేడ్ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా హడావిడిలో ఉన్న విజయ్.. వచ్చే నెల్లో ఈ సినిమా డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి చిత్రానికే డేట్స్ కేటాయించబోతున్నట్టు సమాచారం. 


తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. సినిమాకు వచ్చే నెల్లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరిపి.. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎర్లియర్ గా ‘మాస్టర్’  మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన విజయ్.. ఈ సినిమాతో ఏ స్థాయి హిట్ అందుకుంటాడో చూడాలి.  

Updated Date - 2022-01-28T17:55:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!