సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Icon: అల్లు అర్జున్ కాదు.. రామ్ చరణ్!

ABN, First Publish Date - 2022-09-09T21:55:56+05:30

‘ఓ మై ఫ్రెండ్’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దర్శకడు వేణు శ్రీరామ్ (Venu Sriram). పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తో బంపర్ హిట్ కొట్టాడు. ‘ఐకాన్’ (Icon) కథను సిద్దం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఓ మై ఫ్రెండ్’ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దర్శకడు వేణు శ్రీరామ్ (Venu Sriram). పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తో బంపర్ హిట్ కొట్టాడు. ‘ఐకాన్’ (Icon) కథను సిద్దం చేసుకున్నాడు. అల్లు అర్జున్‌ (Allu Arjun)కు వినిపించగా ఓకే చేశాడు. దిల్ రాజు నిర్మాతగా ప్రాజెక్టును కూడా ప్రకటించాడు. ‘పుష్ప’ (Pushpa) తర్వాత ‘ఐకాన్’ పట్టాలెక్కాలి. కానీ, ఒక్క భాగం అనుకున్న ‘పుష్ప’ రెండుగా మారింది. ‘పుష్ప: ది రైజ్’ అనంతరం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అప్పట్లో అనుకున్న కథ తన స్టార్‌డమ్‌కు సరిపోదని భావించాడు. ఐకాన్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నాడు. భారత్‌లోని ప్రేక్షకులందరికి చేరువయ్యేలా బన్నీ కథలు ఉండాలనుకుంటున్నాడట. అందువల్ల కొత్తగా స్టోరీలను వింటున్నాడని సమాచారం. తాజాగా ‘ఐకాన్’ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలోకి కొత్తగా మెగా హీరో ఎంటర్ అయ్యాడట. 


బన్నీ తప్పుకోవడంతో వేణు శ్రీరామ్ ఐకాన్ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) కు చెప్పగా అంగీకరించాడని సమాచారం. అయితే, రామ్ చరణ్ డేట్స్ యూవీ క్రియేషన్స్ వద్ద ఉన్నాయి. మెగా పవర్ స్టార్ ఆ ప్రొడక్షన్ హౌస్‌కు ఓ సినిమాను చేయాలి. దీంతో ఐకాన్ ప్రాజెక్టులోకి యువీ క్రియేషన్స్ ఎంటరైందని తెలుస్తోంది. ఈ సినిమాను ఆ సంస్థే నిర్మిస్తుందని సమాచారం. కానీ, ఐకాన్ నుంచి బన్నీ తప్పుకొన్నట్టు, రామ్ చరణ్ చేయనున్నట్టు ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి సమాచారం బయటికి రాలేదు. ప్రస్తుతం బన్నీ చేతిలో ‘పుష్ప: ది రూల్’ ఉంది. సెప్టెంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు. వేసవిలో ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది.  

Updated Date - 2022-09-09T21:55:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!