సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Venkatesh : దేవుడిగా నటిస్తున్నాడా?

ABN, First Publish Date - 2022-08-08T19:10:32+05:30

విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ‘గోపాలా గోపాలా’ (Gopala Gopala) చిత్రంలో భక్తుడిగా నటించిన సంగతి తెలిసిందే. అందులో దేవుడిగా పవన్ కళ్యాణ్ నటించి.. సినిమాకి మంచి వెయిట్ తీసుకొచ్చారు. అయితే ఈ సారి ఆ బాధ్యతను వెంకటేశ్ తీసుకోనుండడం విశేషం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ‘గోపాలా గోపాలా’ (Gopala Gopala) చిత్రంలో భక్తుడిగా నటించిన సంగతి తెలిసిందే. అందులో దేవుడిగా పవన్ కళ్యాణ్ నటించి.. సినిమాకి మంచి వెయిట్ తీసుకొచ్చారు. అయితే ఈ సారి ఆ బాధ్యతను వెంకటేశ్ తీసుకోనున్నారని టాక్. ఏ సినిమా అనుకుంటున్నారా? ‘ఓరి దేవుడా’ (Ori Devuda). విశ్వక్ సేన్ (Vishwaksen) హీరోగా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘ఓమై కడవుళే’ (Oh My Kadavule) కి అఫీషియల్ రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) దేవుడిగా నటించాడు. ఆ పాత్రనే తెలుగులో వెంకీ నటిస్తున్నట్టు సమాచారం. అశోక్ సెల్వన్ (Ashok Selvan), రితికా సింగ్ (Rithika Singh) జంటగా నటించారు. వాణి భోజన్ (Vani Bhojan) ప్రత్యేక పాత్రలో నటించింది. ప్రేమించి పెళ్ళిచేసుకొన్న ఒక జంటకి ఎదురైన సమస్యల్ని దేవుడు ఎలా పరిష్కరించాడు అన్న కథాంశంతో ఈ  సినిమా తెరకెక్కింది. 


ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని ఓరి దేవుడా పేరుతో సెట్స్ పైకి వెళ్ళింది. ఇంతవరకూ ఈ సినిమా షూటింగ్ దేవుడు మినహా మిగిలిన  పాత్రలపైనే జరిగింది. దేవుడు పాత్ర కూడా పూర్తయితే .. టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. సినిమాను త్వరలో విడుదల చేయాలనేది నిర్మాత ప్లాన్. అయితే ఇప్పటివరకూ అందులో దేవుడిగా నటించే వారి కోసమే ఎదురు చూసింది చిత్ర బృందం. ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది అనే ఆలోచించగా.. వెంకటేశ్ మదిలో మెదిలారట. వెంటనే వెంకటేశ్ ను సంప్రదించడం, ఆయన ఒప్పుకోవడమూ జరిగిపోయాయి.


నాలుగు రోజల్లో వెంకీ పార్ట్ పూర్తి అయిపోతుందట. తమిళంలో ఆ పాత్రను చేయడానికి విజయ్ సేతుపతి 3 రోజులు టైమ్ తీసుకున్నాడట. వెంకటేష్ పోర్షన్ షూట్ చేసి త్వరలోనే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (Peoples Media Factory) ఈ సినిమాను నిర్మిస్తుండగా.. మిథాలీ పార్కర్ (Mithali Parkar) కథానాయికగా నటిస్తోంది. తమిళ వెర్షన్ ను తెరకెక్కించిన అశ్వథ్ మారిముత్తు (Ashth Marimuthu) నే తెలుగు వెర్షన్ నూ డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా విశ్వక్ సేన్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో.. దేవుడుగా  వెంకీ  ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి. 

Updated Date - 2022-08-08T19:10:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!