సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mega 154 : విలన్‌గా ఆమెనే ఖాయం చేస్తారా?

ABN, First Publish Date - 2022-07-24T17:18:14+05:30

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో బాబీ (Bobby) దర్శకత్వంలోని సినిమా ఒకటి. Mega 154గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్‌ను ఖాయం చేయబోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో బాబీ (Bobby) దర్శకత్వంలోని సినిమా ఒకటి. Mega 154గా పిలుచుకుంటున్న ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్‌ను ఖాయం చేయబోతున్నారు. మైత్రీ మూవీ క్రియేషన్స్ (Mytrhi Movie Creations ) బ్యానర్‌పై మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దేవీశ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్‌రాజా రవితేజ (Raviteja) ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రవితేజ సెట్స్‌లోకి జాయిన్ అవడంపై ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం చిరు, రవితేజలపై కీలక దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. తమిళ బ్యూటీ శ్రుతి‌హాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 


ఇదిలా ఉంటే.. Mega 154కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి చేస్తున్న వీరయ్య పాత్రకు దీటుగా.. ఓ లేడీ విలన్‌ను రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. ఆమె మరోవరో కాదు. సౌత్‌లో లేడీ విలనిజానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిన వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sharathkumar). ఇంతకు ముందు వరూ.. తెలుగులో సందీప్ కిషన్ (Sandeep Kishan) ‘తెనాలి రామకృష్ణ బిఏయల్‌యల్‌బీ’ (Tenali Ramakrishna BA LLB), రవితేజ ‘క్రాక్’ (Krack) చిత్రాల్లో విలన్‌గా నటించగా.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) ఓ సీనియర్ హీరోతో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా వరలక్ష్మి నెగెటివ్ రోల్‌తో అదరగొట్టబోతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి చిత్రంలో కూడా విలన్‌గా నటించనుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


గతంలో చిరంజీవి నటించిన ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్’ (Stuvartpuram Policestation) చిత్రంలో వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ (SharathKumar) విలన్‌గా నటించగా.. ‘గ్యాంగ్‌లీడర్’ (Gangleader) మూవీలో చిరుకు అన్నగా నటించి మెప్పించారు. ఇప్పుడు ఆయన తనయ వరలక్ష్మి సైతం మెగాస్టార్‌కు విలన్‌గా నటించనుండడం విశేషం. ‘ముఠామేస్త్రి’ (Muthamestri) తరహాలోని మాస్ మేకోవర్‌తో చిరంజీవి అభిమానులకు మంచి ఫీస్ట్ ఇవ్వబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. ‘వాల్తేరు వీరయ్య’ను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి వరలక్ష్మి విలనిజం ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి.  

Updated Date - 2022-07-24T17:18:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!