అగ్ర దర్శకుడి కథ Prabhasకి నచ్చలేదా..?

ABN , First Publish Date - 2022-06-01T14:07:18+05:30 IST

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు సంతకం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంతకం చేయడమే కాదు, వరుసగా ఒక్కో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి తనవరకు షూటింగ్ కూడా పూర్తి చేసేస్తున్నారు.

అగ్ర దర్శకుడి కథ Prabhasకి నచ్చలేదా..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా పాన్ ఇండియా చిత్రాలకు సంతకం చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాకు సంతకం చేయడమే కాదు, వరుసగా ఒక్కో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చి తనవరకు షూటింగ్ కూడా పూర్తి చేసేస్తున్నారు. సాహో (Sahoo), రాధే శ్యామ్ (Radhe Shyam) లాంటి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకోవాలనుకుంటే అనూహ్యంగా అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమాలపై గట్టి ఫోకస్ పెట్టారు. కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 


ఈ క్రమంలోనే కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా పేరున్న లోకేష్ కనగ రాజ్ (Lokesh Kanagaraj) ప్రభాస్‌కు ఇటీవలే ఓ కథ వినిపించారని  సమాచారం. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో విక్రమ్ (Vikram) సినిమా రూపొందింది. విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi)..ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూన్ 3న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లోకేష్ కనగ రాజ్ తెరకెక్కించిన విక్రమ్ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతోంది.


ఈ నేపథ్యంలో అటు చెన్నై, ఇటు హైదరాబాద్‌లలో మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ సినిమాను టాలీవుడ్ హీరో నితిన్ విడుదల చేయబోతున్నాడు. అయితే, ఇటీవల హైదరాబాద్ వచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ..ప్రభాస్‌ను కలిసి కథ చెప్పారట. అది ప్రభాస్‌కు నచ్చకపోవడంతో మరోసారి కూడా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ నరేట్ చేయగా, అది కూడా ప్రభాస్‌ను ఆకట్టుకోలేదట. అందుకే, లోకేష్‌కు సింపుల్‌గా ప్రభాస్‌ నో చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. కాగా, ఆయన ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

Updated Date - 2022-06-01T14:07:18+05:30 IST

Read more