Mahesh కోసం సుకుమార్ కూడా..?
ABN , First Publish Date - 2022-06-23T20:18:09+05:30 IST
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఇటీవల సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఇటీవల సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. కీర్తి సురేశ్ (Keerthi Suresh) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పరశురామ్ పెట్లా (Parasuram Petla) దర్శకత్వం వహించాడు. పోకిరి వైబ్స్ అని ప్రచారం చేశారు. అయితే, బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. అయితే, త్వరలో మహేశ్ నెక్స్ట్ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే త్రివిక్రమ్, మహేశ్ బాబుకు స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ కూడా చెప్పి ఒకే అనిపించుకున్నారట. ఈ నేపథ్యంలో జూలై నుంచి మహేశ్ 28వ సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ (Pooja Hegde)గా నటించబోతున్న ఈ చిత్రానికి S S థమన్ (S S Thaman) సంగీతం అందిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేశ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S S Rajamouli)దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాను చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుగుతోంది.
అయితే, తాజాగా మహేశ్ - సుకుమార్ (Sukumar) కలిసి ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. గతంలో వీరి కాంబోలో వచ్చిన '1 నేనొక్కడినే' నిరాశపరిచింది. అప్పటి నుంచి మహేశ్‌తో మళ్ళీ సినిమా తీసి భారీ హిట్ ఇవ్వాలనే కసితో సుక్కూ ఉన్నారు. కానీ, ఆ మూవీ సెట్ అవడం లేదు. త్రివిక్రమ్ సినిమా తర్వాత గనక వెంటనే జక్కన్న ప్రాజెక్ట్ మొదలవకపోతే సుక్కూతో సినిమా చేయాలని సూపర్ స్టార్ భావిస్తున్నారట. ఈ లోపు సుక్కూ, అల్లు అర్జున్‌తో 'పుష్ప 2' పూర్తి చేసేసి మహేశ్ మూవీ కోసం రెడీ అవుతారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో అటు మహేశ్ లేదా ఇటు సుకుమార్ స్పందిస్తే గానీ క్లారిటీ వస్తుంది.