సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మెగాస్టార్ జోడీగా శ్రుతి హాసన్?

ABN, First Publish Date - 2022-01-06T20:18:11+05:30

కోలీవుడ్ స్టార్ డాటర్ శ్రుతి హాసన్... ఏడాది రవితేజ ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో శ్రుతి టాలీవుడ్ లో మరోసారి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆల్రెడీ ప్రభాస్ ‘సలార్’ లో శ్రుతి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఓ సీనియర్ హీరో సరసన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే యాక్షన్ మూవీలో కథానాయికగా ఎంపికైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ స్టార్ డాటర్ శ్రుతి హాసన్... గతేడాది రవితేజ ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో శ్రుతి  టాలీవుడ్ లో  మరోసారి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఆల్రెడీ ప్రభాస్ ‘సలార్’ లో శ్రుతి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఓ సీనియర్ హీరో సరసన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కే యాక్షన్ మూవీలో కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. శ్రుతి హాసన్ కు మరో సీనియర్ హీరో సినిమాలో కూడా కథానాయికగా ఛాన్స్ వచ్చిందట. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. 


చిరంజీవి 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మొన్నీమధ్యే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టారు. ఇందులో కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక చేయబోతున్నారని టాక్. చిరు సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే శ్రుతి హాసన్ ఎంపికపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది.  తమ్ముడు పవర్ స్టార్ సరసన ‘గబ్బర్ సింగ్, కాటమరాయుడు’ చిత్రాల్లో నటించిన శ్రుతి..  అన్న మెగాస్టార్ సరసన కూడా హీరోయిన్ గా నటిస్తూండడం విశేషంగా మారింది. మరి చిరుతో ఆమె రొమాన్స్ ఏ స్థాయిలో పండుతుందో చూడాలి. 

Updated Date - 2022-01-06T20:18:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!