చరణ్ - శంకర్ సినిమా.. ఓ కట్టప్ప?

ABN , First Publish Date - 2022-03-15T16:36:00+05:30 IST

‘బాహుబలి’ చిత్రంలో మహిష్మతి సామ్రాజ్యానికి విధేయుడిగా ఉంటూ.. బాహుబలిని కంటికి రెప్పలా కాపాడే కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అదరగొట్టాడు. చివరికి అదే పాత్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచినా.. ప్రేక్షకుల దృష్టిలో అతడు విలన్ అవలేదు. అదే రాజమౌళి మ్యాజిక్. ఇదే మ్యాజిక్ ను శంకర్ .. రామ్ చరణ్ హీరోగా నటించే సినిమాలో రిపీట్ చేయబోతున్నాడని టాక్. ఇందులో కట్టప్ప లాంటి పాత్రను శ్రీకాంత్ చేయబోతున్నాడట. RC 15 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని వినికిడి. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ కు శ్రీకాంత్ ప్రాణస్నేహితుడట. ఇద్దరూ పార్టీ కోసం పనిచేస్తారు.

చరణ్ - శంకర్ సినిమా.. ఓ కట్టప్ప?

‘బాహుబలి’ చిత్రంలో మహిష్మతి సామ్రాజ్యానికి విధేయుడిగా ఉంటూ.. బాహుబలిని కంటికి రెప్పలా కాపాడే కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అదరగొట్టాడు. చివరికి అదే పాత్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచినా.. ప్రేక్షకుల దృష్టిలో అతడు విలన్ అవలేదు.  అదే రాజమౌళి మ్యాజిక్. ఇదే మ్యాజిక్ ను శంకర్ .. రామ్ చరణ్ హీరోగా నటించే సినిమాలో రిపీట్ చేయబోతున్నాడని టాక్. ఇందులో కట్టప్ప లాంటి పాత్రను శ్రీకాంత్ చేయబోతున్నాడట. RC 15 గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని వినికిడి.  ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ కు శ్రీకాంత్ ప్రాణస్నేహితుడట. ఇద్దరూ పార్టీ కోసం పనిచేస్తారు. చివరికి చరణ్ కు వెన్నుపోటు పొడిచి శ్రీకాంత్ ముఖ్యమంత్రి అవుతాడట. అక్కడే ఈ కథ ఆసక్తికరమైన మలుపు తిరబోతోందని టాక్. శ్రీకాంత్ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అన్నదే ఈ సినిమాకి కీలకమని తెలుస్తోంది. ఇక ఇందులో తమిళ నటదర్శకుడు యస్.జె సూర్య ప్రధాన విలన్ గా నటిస్తున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. అతడికి , శ్రీకాంత్ కు లింకేంటన్నది ఆసక్తికరంగా ఉంటుందట. ఇంతకు ముందు శ్రీకాంత్ అఖంలో విలన్ గా నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే శంకర్ చిత్రంలో శ్రీకాంత్ పాత్ర సినిమాకే హైలైట్ కానుందని సమాచారం.


కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, జయరామ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ లో 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఇదివరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఇటీవల రాజమండ్రిలో మొదలు పెట్టింది. ఇక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగిన తర్వాత హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల హడావిడిలో ఉన్న చెర్రీ.. వచ్చే నెల్లో  తండ్రి చిత్రం ‘ఆచార్య’ సినిమా విడుదల విషయంలోనూ ఆత్రుతగా ఉన్నాడు. మరి RC 15 లో శ్రీకాంత్ పాత్ర ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-03-15T16:36:00+05:30 IST