సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మహేశ్ బాబుతో ..అంటున్న 'పెళ్లి సందD' బ్యూటీ..!

ABN, First Publish Date - 2022-01-04T16:19:12+05:30

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక్క ఛాన్స్ కావాలంటోందట 'పెళ్లి సందD' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల. రోషన్ హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక్క ఛాన్స్ కావాలంటోందట 'పెళ్లి సందD' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల. రోషన్ హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కించిన 'పెళ్లి సందD' ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీలీల ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో అమ్మడికి అవకాశాలు వరుసగా వస్తున్నాయట. ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, తనకు మహేశ్ బాబు సినిమాలో అవకాశం కావాలని అడుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమైన యంగ్ హీరోయిన్స్ ఎవరైనా మన టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారి సరసన నటించే అవకాశం కోసం ఆరాటపడుతుంటారు. అలాగే, ఇప్పుడు శ్రీలీల సూపర్ స్టార్‌తో రొమాన్స్ చేయాలని ఆశపడుతోంది. మరి అమ్మడి కోరిక తీరుతుందో లేదో చూడాలి. 

Updated Date - 2022-01-04T16:19:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!