రీఎంట్రీ ఇవ్వబోతున్న‘మురారి’ ముద్దుగుమ్మ ?

ABN , First Publish Date - 2022-03-13T21:35:18+05:30 IST

మహేశ్ బాబు ‘మురారి’ చిత్రంతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బెంద్రే. తొలి సినిమానే సూపర్ హిట్ అవడంతో .. ఆ తర్వాత ‘ఖడ్గం, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా యం.బీ.బీ.యస్’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు . 2013 లోనే సినిమాలకు గుడ్ బై చెప్పిన సోనాలి.. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్ళింది. మూడేళ్ళ క్రితం ఆమె కేన్సర్ బారిన పడింది. న్యూయార్క్ లో కొంత కాలం ట్రీమ్ మెంట్ తీసుకుంది. ఆ క్రమంలో ఆమె తన జుట్టును కూడా కోల్పోయింది. తను కేన్సర్ తో ఎంతగా పోరాడుతున్నదో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు తెలుపుతూ ఉండేది సోనాలి.

రీఎంట్రీ ఇవ్వబోతున్న‘మురారి’ ముద్దుగుమ్మ ?

మహేశ్ బాబు ‘మురారి’ చిత్రంతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బెంద్రే.  తొలి సినిమానే సూపర్ హిట్ అవడంతో .. ఆ తర్వాత ‘ఖడ్గం, మన్మధుడు, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా యం.బీ.బీ.యస్’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు . 2013 లోనే సినిమాలకు గుడ్ బై చెప్పిన సోనాలి.. ఆ తర్వాత టీవీ రంగంలోకి వెళ్ళింది. మూడేళ్ళ క్రితం ఆమె కేన్సర్ బారిన పడింది. న్యూయార్క్ లో కొంత కాలం ట్రీమ్ మెంట్ తీసుకుంది. ఆ క్రమంలో ఆమె తన జుట్టును కూడా కోల్పోయింది. తను కేన్సర్ తో ఎంతగా పోరాడుతున్నదో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు తెలుపుతూ ఉండేది సోనాలి. అయితే ఆమె ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు.  అభిమానుల ప్రార్ధనలు ఫలించి సోనాలీ కేన్సర్ ను జయించి తిరిగి మామూలు మనిషైంది. పూర్తి ఆరోగ్యంతో భర్త, పిల్లలతో కలిసి పలు ఈవెంట్స్ కు హాజరయింది.  అయితే మళ్ళీ సినిమాల్లోకి రావాలనుకోలేదు. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లో నటించబోతోందని వార్తలు అందుతున్నాయి. 


గతంలో సోనాలీకి టాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె ఎందుకనో అంగీకరించలేదు. ఎట్టకేలకు ఇప్పుడామె ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. యన్టీఆర్ కొరటాల చిత్రంలో సోనాలీకి ఓ కీలక పాత్ర ను ఆఫర్ చేయబోతున్నారట. ఆ దిశగా కొరటాల ప్రయత్నాలు మొదలు పెట్టాడట. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఆమె ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారట. ఎలాగూ ఇందులో బాలీవుడ్ బ్యూటీ  ఆలియా భట్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు సోనాలీ కూడా అంగీకరిస్తే .. చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో మరింతగా వెయిట్ వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2022-03-13T21:35:18+05:30 IST