మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో Sivakarthikeyan..?

ABN , First Publish Date - 2022-07-08T15:05:34+05:30 IST

మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సినిమా చేయబోతున్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్ (Rajinikanth),

మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో Sivakarthikeyan..?

మరో టాలీవుడ్ డైరెక్టర్‌తో శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సినిమా చేయబోతున్నట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరోలు రజినీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan), అజిత్ (Ajith), విజయ్ (Vijay), సూర్య (Surya), కార్తి (Karthi), ధనుష్ (Dhanush) ల రూట్‌లోనే శివ కార్తికేయన్ కూడా తాను నటించిన సినిమాలను తెలుగులోనూ అనువాదం చేసి ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు 'జాతిరత్నాలు' ఫేమ్ కెవీ అనుదీప్ (KV Anudeep) దర్శకత్వం వహిస్తున్నాడు.


ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, శివ కార్తికేయన్ మరో తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పుడు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి 'సోగ్గాడే చిన్ని నాయన', 'బంగార్రాజు' సినిమాలతో హిట్స్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krshna Kurasala) దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాను కోలీవుడ్ అగ్ర నిర్మాత కే.ఇ. జ్ఞాన్ వేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. 


ఇక ఈ చిత్రానికి గాను శివ కార్తికేయన్ ఏకంగా 20 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఈ మధ్య కాలంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన 'డాక్టర్ జి', 'డాన్' చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ఇక తెలుగులో మొదటిసారి సినిమా చేస్తున్న ఈ కోలీవుడ్ హీరోకు ఎలాంటి సక్సెస్ దక్కుతుందో తెలియాలంటే మూవీ విడుదలయ్యేవరకు వెయిట్ చేయాలి. 

Updated Date - 2022-07-08T15:05:34+05:30 IST

Read more