సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శృతి హాసన్ కాదు అనుష్క శెట్టి ?

ABN, First Publish Date - 2022-01-11T13:25:23+05:30

'క్రాక్' సినిమాతో మూడేళ్ళ తర్వాత తెలుగులో భారీ హిట్ అందుకున్న శృతి హాసన్ వరుసగా పెద్ద హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే అవకాశం అందుకుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'క్రాక్' సినిమాతో మూడేళ్ళ తర్వాత తెలుగులో భారీ హిట్ అందుకున్న శృతి హాసన్ వరుసగా పెద్ద హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్  చిరంజీవి సరసన నటించే అవకాశం అందుకుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు తన ప్లేస్‌ను అనుష్క శెట్టి రీ ప్లేస్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న చిరు ఇటీవలే 'ఛలో', 'భీష్మ' చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుమల దర్శకత్వంలో ఓ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇందులో హీరోయిన్‌గా ముందు శృతి హాసన్‌ను ఎంచుకున్నారని టాక్ వినిపించింది. అయితే, ఇప్పుడు శృతి కాదు అనుష్క శెట్టి అని సమాచారం. ఈ సినిమాలో చిరు సరసన స్వీటీ ఆడిపాడనుందట. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Updated Date - 2022-01-11T13:25:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!