సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Supreme Hero తో ‘రచ్చ’ దర్శకుడు?

ABN, First Publish Date - 2022-06-20T16:27:29+05:30

టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ చిత్రాలు తీయడంలో ప్రత్యేకతను చాటుకున్నాడు సంపత్ నంది (Sampath Nandi). రెండో ప్రయత్నంలోనే మెగా హీరో రామ్ చరణ్ (Ramcharan) తో ‘రచ్చ’(Rachha) చిత్రం తీసి సూపర్ సక్సె్స్ అందుకున్న సంపత్ .. ఆ తర్వాత రవితేజ (Ravieja) హీరోగా ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) తో కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లో మాస్ యాక్షన్ చిత్రాలు తీయడంలో ప్రత్యేకతను చాటుకున్నాడు సంపత్ నంది (Sampath Nandi). రెండో ప్రయత్నంలోనే మెగా హీరో రామ్ చరణ్ (Ramcharan) తో ‘రచ్చ’(Rachha) చిత్రం తీసి సూపర్ సక్సె్స్ అందుకున్న సంపత్ .. ఆ తర్వాత రవితేజ (Ravieja) హీరోగా ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger) తో కూడా డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆపై గోపీచంద్ (Gopichand) తో గౌతమ్ నంద (Gowtham Nanda), సీటీమార్ (Seetimaar) చిత్రాలు వరుసగా తెరకెక్కించి.. సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘ఓదెల రైల్వేస్టేషన్ (Odela Railwaystation), బ్లాక్ రోజ్ (Black Rose)’ చిత్రాలకు కథ అందిస్తుండగా.. జగపతి బాబు (Jagapthi Babu) హీరోగా ‘సింబా’ (Simba) అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వీటితో పాటు ‘విక్రమార్కుడు 2’ (Vikramarkudu 2) చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదిలా ఉంటే..  సంపత్ నంది సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 


ఇటీవల సాయిధరమ్ తేజ్ కు సంపత్ ఓ కథ వినిపించగా.. దానికి బాగా ఇంప్రెస్ అయిన సాయిధరమ్.. చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హైఓల్టే్జ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాని సితారా ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamshi) నిర్మించబోతున్నట్టు టాక్. యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇటీవల సుకుమార్ (Sukumar) శిష్యుడు కార్తిక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో ఓ మిస్టి్క్ థ్రిల్లర్ ను ప్రారంభించిన సాయిధరమ్ తేజ్..ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాకా సంపత్ నంది చిత్రంలో నటించబోతున్నాడని వినికిడి. అప్పటికి సంపత్ నంది ‘విక్రమార్కుడు 2’ చిత్రాన్ని కంప్లీట్ చేస్తాడు. మరి సంపత్ నంది సాయిధరమ్ తేజ్ కు ఏ స్థాయిలో చిత్రాన్నిస్తాడో చూడాలి. 

Updated Date - 2022-06-20T16:27:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!