పుష్ప: ది రూల్‌లో సమంత స్పెషల్ రోల్..?

ABN , First Publish Date - 2022-03-27T17:28:15+05:30 IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప: ది రైజ్ పార్ట్ 2 భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్

పుష్ప: ది రూల్‌లో సమంత స్పెషల్ రోల్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన పాన్ ఇండియన్ సినిమా పుష్ప: ది రైజ్ పార్ట్ 2 భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రూపొందబోతోంది. మైత్రీ మూవీస్ - ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, స్టార్ హీరోయిన్ సమంత పుష్ప పార్ట్ 1లో 'ఊ అంటావా మావా' అంటూ ఐటెం సాంగ్ చేసి ఊపేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రూపొందనున్న ఈ మూవీ సీక్వెల్‌లోనూ ఓ ఐటెం సాంగ్ ఉండగా ..దీనికి బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానిని తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఇదిలా ఉంటే తాజా సమాచారం మేరకు పుష్ప 2లో సామ్ కోసం సుకుమార్ ఓ కీ రోల్ క్రియేట్ చేశాడట. పార్ట్ 1లో ఐటెం సాంగ్ చేసి అలరించిన సామ్ సీక్వెల్ మూవీలో అద్భుతమైన పాత్రతో ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజమైతే సుక్కూ ఖచ్చితంగా సమంతను కెరీర్‌లో నిలిచిపోయే పాత్రలో చూపించడం ఖాయం. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Updated Date - 2022-03-27T17:28:15+05:30 IST