Samantha : హీరోయిన్గా క్రేజీ బాలీవుడ్ చిత్రం?
ABN, First Publish Date - 2022-07-25T14:23:05+05:30
సమంత (Samantha) ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నట్టు కనిపించినా.. ఆమె ప్రధాన లక్ష్యం బాలీవుడ్డే అనిపిస్తోంది. టాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు కృషి చేస్తూనే, బాలీవుడ్ బడా స్టార్స్ సరసన జోడీగా నటించేందుకూ పావులు కదుపుతోంది.
సమంత (Samantha) ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నట్టు కనిపించినా.. ఆమె ప్రధాన లక్ష్యం బాలీవుడ్డే అనిపిస్తోంది. టాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన క్రేజ్‌ను కంటిన్యూ చేసేందుకు కృషి చేస్తూనే, బాలీవుడ్ బడా స్టార్స్ సరసన జోడీగా నటించేందుకూ పావులు కదుపుతోంది. రాబోయే రోజుల్లో సామ్ నుంచి బాలీవుడ్లో పెద్ద సినిమాలే రాబోతున్నాయని సమాచారం అందుతోంది. ఆల్రెడీ క్రేజీ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా (Ayushman Kurana) జోడీగా ఒక సినిమా ఖాయం చేసుకుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించేందుకు చర్చలు జరుపుతోంది. ఇంకా మరో యంగ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) తో ఒక బిగ్ ప్రాజెక్ట్‌కు కమిట్మెంట్ ఇచ్చింది. ఇవి ఇలా ఉండగా.. ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సామ్ కథానాయికగా నటించబోతున్నట్టు టాక్.
బాలీవుడ్ సూపర్ స్టార్స్‌లో.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను, బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న అక్షయ్ కుమార్ (Akshay Kumar) జోడీగానే సామ్ నటించేందుకు రెడీ అవుతుండడం విశేషం. రీసెంట్గా సమంత అక్షయ్ కుమార్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ (Coffee With Karan) టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కరణ్‌తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దానికి సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాతగా ధర్మా ప్రొడక్షన్స్ (Dharma Productions) బ్యానర్‌పై త్వరలోనే ఒక అమ్మాయితో ఒక లాజికల్ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. అందులో మెయిన్ హీరోయిన్గా సమంతను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆ చర్చల అనంతరం కరణ్, అక్షయ్, సామ్‌ల మధ్య దీని గురించి చర్చ జరిగినట్టు వినికిడి.
ప్రస్తుతం సమంత, గుణశేఖర్ (Gunasekhar) స్వీయ దర్శకత్వంలో ‘శాకుంతలం’ (Shaakunthalam) అనే పౌరాణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాకీ పార్ట్ ను పూర్తి చేసుకొని సీజీ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. అలాగే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన కథానాయికగా ‘ఖుషీ’ (Khushi) అనే రొమాంటిక్ లవ్ స్టోరీలోనూ నటిస్తోంది. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇంకా ‘యశోద’ (Yashoda) అనే పాన్ ఇండియా థ్రిల్లర్ మూవీలోనూ సామ్ నటిస్తోంది. హరి - హరీష్ (Hari- Harish) దర్శకద్వయం దీన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది.