సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha : ‘పుష్ప2’లోనూ ఐటెం సాంగ్..?

ABN, First Publish Date - 2022-04-08T19:07:03+05:30

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చి పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ హిట్ సాధించిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1లో స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చి పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ హిట్ సాధించిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1లో స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారి ఐటెం సాంగ్ చేసి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ పాటలో సమంత పర్ఫార్మెన్స్ అంత బాగోలేదని కామెంట్స్ వినిపించాయి. కానీ, ఆ తర్వాత సమంత ఎక్కడ చూసినా సాంగ్‌తో 'ఊ అంటావా మావా అంటూ' ఊపేసింది. చెప్పాలంటే ఈ పాటలో అల్లు అర్జున్‌తో కలిసి సమంత వేసిన మాస్ స్టెప్స్ ఆడియన్స్‌కు చమటలు పట్టించాయి. అంత ఘాటుగా తన అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. 


అయితే, తాజా సమాచారం మేరకు త్వరలో సెట్స్ మీదకు రాబోతున్న పుష్ప సీక్వెల్ మూవీలో కూడా ఐటెం సాంగ్ కోసం సమంతనే తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. మొన్నా మధ్య ఇందులో ఓ స్పెషల్ రోల్‌లో సామ్ కనిపించనుందని..తన పాత్ర హైలెట్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఐటెం సాంగ్ కోసం తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏది నిజమో తెలీదు గానీ, అభిమానులు మాత్రం ఈ మూవీ సీక్వెల్‌లో కూడా సమంత ఉంటే బావుంటుందని అభిప్రాయపడుతున్నారు.  

Updated Date - 2022-04-08T19:07:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!