సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha: మరో స్పెషల్ సాంగ్‌కు ఒప్పుకుందా..?

ABN, First Publish Date - 2022-06-28T14:23:56+05:30

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరో స్పెషల్ సాంగ్ ఒప్పుకుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి వైరల్ అవుతోంది. తెలుగులో అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో సంచలన దర్శకుడిగా అసాధారణమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరో స్పెషల్ సాంగ్ ఒప్పుకుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త వచ్చి వైరల్ అవుతోంది. తెలుగులో అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో సంచలన దర్శకుడిగా అసాధారణమైన క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga). ఈ సినిమాను హిందీలో కూడా ఆయనే రూపొందించి భారీ హిట్ అందుకున్నాడు. అక్కడ షాహిద్ కపూర్ Shaid Kapoor), కియారా అద్వానీ (Kiara Advani) జంటగా నటించారు. అప్పటివరకూ ఉన్న క్రేజ్ కంటే షాహిద్ నటించిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ (kabeer Singh) రెట్టింపు పాపులారీని తెచ్చిపెట్టింది.


దాంతో బాలీవుడ్ హీరోలు సందీప్ రెడ్డి వంగతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ( Ranbeer Kapoor) - సందీప్ రెడ్డి వంగల కాంబినేషన్‌లో 'యానిమల్' (Animal) అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ముందు పరిణీతి చోప్రా (Parineethi Chopra)ని హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకున్నారు. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశం క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు దక్కిందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇదే సినిమాలో సమంత కనిపించబోతుందని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది.


ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ ఉందని దీనికోసం పలువురు స్టార్ హీరోయిన్స్‌ను సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా 'యానిమల్' బృందం సమంతను సంప్రదించిందట. పుష్ప సినిమాలో ఆమె చేసిన 'ఊ అంటావా మావా ఊహూ అంటావా మావా' సాంగ్ చేసి ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌తో సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే, మేకర్స్ 'యానిమల్' సినిమాలో ఉన్న ఐటెం సాంగ్‌కు సమంతను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో చూడాలి.

Updated Date - 2022-06-28T14:23:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!