Virata Parvamలో సాయిపల్లవి అలా కనిపించబోతుందా?

ABN , First Publish Date - 2022-06-04T02:50:07+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతా 90ల్లో నక్సల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అన్నలు అంటే ప్రజల్లో ఒక గౌరవం ఉండేది. వాళ్ళు పోరాడేది మనకోసమే, ప్రాణాలిచ్చేది మన కోసమే అని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. ఆ తర్వాత కాలంలో ఉద్యమం

Virata Parvamలో సాయిపల్లవి అలా కనిపించబోతుందా?

తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతా 90ల్లో నక్సల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అన్నలు అంటే ప్రజల్లో ఒక గౌరవం ఉండేది. వాళ్ళు పోరాడేది మనకోసమే, ప్రాణాలిచ్చేది మన కోసమే అని ప్రతి ఒక్కరూ నమ్మేవారు. ఆ తర్వాత కాలంలో ఉద్యమం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అయితే ఉద్యమం పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, ఆ వేవ్‌ని క్యాష్ చేసుకోవడానికి ఎన్నో సినిమాలు.. ఉద్యమాలను బేస్ చేసుకోని వచ్చి కాసుల వర్షం కురిపించాయి. గత కొంతకాలంగా ఈ జానర్‌లో సినిమా అయితే రాలేదు కానీ, 2022లో మాత్రం తెలుగులో రెండు సినిమాలు ఈ జానర్‌లో తెరకెక్కాయి. అందులో ఒకటి ‘ఆచార్య’ (Acharya) జస్ట్ అలా టచ్ చేసిపోగా.. పూర్తి స్థాయిలో రూపొందిన ‘విరాటపర్వం’ (Virata Parvam) విడుదలకు సిద్ధమైంది. 


రానా (Rana), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కలిసి నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu Udugula) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. జూన్ 17న విడుదల కానున్న ఈ మూవీ ప్రొమోషన్స్‌ని మొదలు పెట్టిన చిత్రయూనిట్, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వదులుతున్నారు. అయితే ఇప్పటివరకు బయటకి వచ్చిన అప్డేట్స్ చూస్తే... రానా కన్నా సాయి పల్లవి పైనే విరాటపర్వం ఎక్కువగా ఫోకస్ అయినట్లు తెలుస్తోంది. వేణు ఊడుగుల ఈ చిత్ర కథని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించానని చెప్పాడు. ఆ వాస్తవ సంఘటనలు ఏంటంటే, బెల్లీ లలిత (Belli Lalitha) జీవితం ఆధారంగా విరాటపర్వం సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. 


నక్సల్ ఉద్యమం పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో.. లలిత ఎన్నో పాటలు పాడి, ఎన్నో ప్రసంగాలు చేసి ఉద్యమాన్ని.. ఉద్యమ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వాళ్లని చైతన్య వంతం చేసే ప్రయత్నం చేసింది. ఆమె ఎరుపు రంగు అద్దుకున్న నిప్పు కణిక లాంటిది. అందుకే ఆమెని పోలీసులు పట్టుకుని.. ముక్కలు ముక్కలుగా నరికి.. వాటిని ఎక్కడెక్కడో చల్లారనే టాక్ వినబడుతుంటుంది. ఇది చరిత్రలో ఒక ఆడదానికి జరిగిన ఘోరమైన సంఘటనగా వర్ణిస్తుంటారు. బెల్లి లలితతో పాటు ఆమె టీంని కూడా పోలీసులు ఘోరంగా చంపారు. ఇప్పుడా బెల్లి లలిత జీవితానికే కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకొని వేణు ఊడుగుల ‘విరాటపర్వం’ తెరకెక్కించాడనేలా టాక్ వినబడుతోంది. అదే నిజమైతే.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి, బెల్లి లలితగా ఎంతవరకూ మెప్పిస్తుందో చూడాలి. కాగా, డి. సురేష్ బాబు (D Suresh Babu) స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ (SLV Cinemas) ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించారు. సురేష్ బొబ్బిలి (Suresh Bobbili) సంగీతం అందించారు.

Updated Date - 2022-06-04T02:50:07+05:30 IST

Read more