సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్..మరోసారి 'ఎఫ్ 3' వాయిదా..?

ABN, First Publish Date - 2022-01-22T20:20:39+05:30

'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్‌తో మరోసారి 'ఎఫ్ 3' మూవీ వాయిదా..? అనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం మేకర్స్ తాజాగా రెండు తేదీలను ఫిక్స్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'ఆర్ఆర్ఆర్' ఎఫెక్ట్‌తో మరోసారి 'ఎఫ్ 3' మూవీ వాయిదా..? అనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం మేకర్స్ తాజాగా రెండు తేదీలను ఫిక్స్ చేశారు. అందులో ఒకటి మార్చ్ 18 కాగా, మరొకటి ఏప్రిల్ 28. కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులను బట్టి ఈ రెండు తేదీలలో ఒక తేదీన ఖచ్చితంగా ఈ చిత్రాన్ని తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర హీరోలు రామ్ చరణ్, ఎన్.టి.ఆర్‌లతో డిజైన్ చేసిన స్పెషల్ పోస్టర్‌ను కూడా వదిలారు.


అయితే, ఇప్పుడు 'ఎఫ్ 3' మరోసారి వాయిదా పడబోతుందనే ప్రచారం మొదలైంది. ఏప్రిల్ 28న 'ఎఫ్ 3' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. తాజాగా 'ఆర్ఆర్ఆర్' మేకర్స్ ఫిక్స్ చేసుకున్న రెండు తేదీలలో ఏప్రిల్ 28 ఒకటి కావడంతో అదే రోజు 'ఎఫ్ 3' రిలీజ్ చేయడం కష్టమని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'ఎఫ్ 2' సీక్వెల్‌గా 'ఎఫ్ 3' రూపుందుతోంది. వెంకటేశ్ - తమన్న, వరుణ్ తేజ్ - మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-01-22T20:20:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!