అటకెక్కిన RC 16?
ABN , First Publish Date - 2022-06-01T21:48:26+05:30 IST
నాని 'జెర్సీ' (Jersey) సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri). అతడితో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) ఒక సినిమా చేయపోతున్న సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నాని 'జెర్సీ' (Jersey) సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri). అతడితో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) ఒక సినిమా చేయపోతున్న సంగతి తెల్సిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి.. గత కొన్ని రోజులుగా ఎదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే RC15 మొదలవడంతో... గౌతమ్ ‘జెర్సి’ హిందీ వెర్షన్ లో బిజీ అయిపోయాడు. షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా ‘జెర్సీ’ సినిమా హిందీలో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఎమోషనల్ గా తెలుగు ఆడియన్స్ ను బాగా కదిలించిన ఈ సినిమా హిందీ వెర్షన్‌కు మాత్రం బాలివుడ్ ఆడియన్స్ కనెక్ట్ కాలేక పోయారు. పైగా స్లో నేరేషన్, మితిమీరిన క్రికెట్ ఉంది అంటూ విమర్శలు చేశారు. అది వసూళ్లుపై బాగా ప్రభావం చూపించి... ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో గౌతమ్ రీజనల్ సినిమాలు చేయడమే బెటర్ అనే కామెంట్స్ వినిపించాయి.
హిందీ జెర్సీ ఫలితం ప్రభావం గౌతం, రామ్‌చరణ్ కాంబినేషన్ లో రానున్న సినిమాపై బాగా పడింది. ఇది కూడా క్రీడా నేపథ్యంలోనే రుపొందనుండడంతో, ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు చేసే పనిలో పడ్డాడు. మార్కెట్ పెంచుకుంటున్న ఈ టైంలో, గౌతం తిన్ననూరి తెలుగు ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయ్యే ఎమోషన్ తో సినిమా చేస్తే, పాన్ ఇండియా స్థాయిలో దాన్ని ఎలా రిలీజ్ చేయాలి అనే ఆలోచన చరణ్ ని డైలమాలో పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే గౌతం సినిమా అటకెక్కనుందా అనే సందేహాలు నెలకొన్నాయి. రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబో సినిమా క్యాన్సిల్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఏమో ఈ ఏడాది చివర్లో రామ్ చరణ్, శంకర్ (Shankar) మూవీ పూర్తి అవుతుంది. ఆ వెంటనే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా కు రామ్ చరణ్ డేట్లు ఇచ్చాడని అంటున్నారు. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం, చరణ్ డేట్స్ ఇవ్వడం... ఈ రెండు వార్తలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది నిజమో తెలియాలి అంటే చరణ్ శంకర్ సినిమా పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే.