# RC 15: నో చెప్పిన మలయాళ స్టార్ హీరో..?

ABN , First Publish Date - 2022-04-08T17:36:26+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నో చెప్పారని తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది.

# RC 15: నో చెప్పిన మలయాళ స్టార్ హీరో..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమాకు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నో చెప్పారని తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీతో భారీ హిట్ అందుకున్న చరణ్ ఇదే నెలలో తండ్రి మెగాస్టార్‌తో కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ ఆచార్య మూవీతో రాబోతున్నాడు. అయితే, ఇప్పటికే కోలీవుడ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమాను చేస్తున్నాడు చరణ్. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో శ్రీకాంత్, జయరామ్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


అయితే, ఇందులో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు శంకర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను సంప్రదించారట. కానీ, ఆయన ఈ పాత్ర చేసేందుకు నో చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు కారణం ఆ పాత్రలో నెగిటివ్ షేడ్ ఉండటమేనట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదుగానీ, శంకర్ ఇచ్చిన ఆఫర్ మోహన్ లాల్ వదిలేశారనే కామెంట్స్ మాత్రం వినిపిస్తున్నాయి. కాగా, త్వరలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ అమృత్‌సర్‌లో మొదలవబోతుందని సమాచారం. ఈ షెడ్యూల్‌లో మేజర్ టాకీ పార్ట్ కంప్లీట్ చేయబోతున్నారట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - 2022-04-08T17:36:26+05:30 IST

Read more