మరో కొత్త దర్శకుడికి Raviteja అవకాశం?

ABN , First Publish Date - 2022-06-19T22:25:58+05:30 IST

కొందరు స్టార్ హీరోలయినప్పటికీ.. వారి కాల్షీట్స్ ఖాళీగానే ఉంటాయి. కథలు సెట్ అవకో, దర్శక నిర్మాతలు ఖాయం అవ్వకో.. వారి డైరీలోని పేజెస్ ఖాళీగా ఉండడం సాధారణంగా జరిగేదే. అయితే మాస్ రాజా రవితేజ (Raviteja) వీరిందరికీ చాలా భిన్నం. ఆయన దగ్గర మాత్రం కాల్షీట్స్ గంపగుత్తుగా ఉంటాయి.

మరో కొత్త దర్శకుడికి Raviteja అవకాశం?

కొందరు స్టార్ హీరోలయినప్పటికీ.. వారి కాల్షీట్స్ ఖాళీగానే ఉంటాయి. కథలు సెట్ అవకో, దర్శక నిర్మాతలు ఖాయం అవ్వకో.. వారి డైరీలోని పేజెస్ ఖాళీగా ఉండడం సాధారణంగా జరిగేదే. అయితే మాస్ రాజా రవితేజ (Raviteja) వీరిందరికీ చాలా భిన్నం. ఆయన దగ్గర మాత్రం కాల్షీట్స్ గంపగుత్తుగా ఉంటాయి. నిర్మాత ఓకే అన్నా, దర్శకుడి దగ్గర కథున్నా.. సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మాస్ మహారాజా స్టైల్. అందుకే ఆయన చేతిలో ఇప్పుడు అరడజను వరకూ ప్రాజెక్టులున్నాయి. ఇంకా కొత్తవి ఒప్పుకుంటూనే ఉన్నాడు. కథ నచ్చితే చాలు.. దర్శకుడిగా ఎవరిని పరిచయడం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో రవితేజ అంబుల పొదిలోకి మరో కొత్త ప్రాజెక్ట్ , సరికొత్త దర్శకుడు చేరినట్టు సమాచారం. 


కార్తికేయ (Karthikeya), ఎక్స్ ప్రెస్ రాజా (Express Raja), నిన్నుకోరి (Ninnu Kori), చిత్రలహరి (Chitralahari) లాంటి సినిమాలకి ఛాయాగ్రహణం అందించిన కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni).. టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న కెమేరా మేన్. తను ఓ సినిమాకి కమిట్ అయితే అది ఖచ్చితంగా హిట్టనే నమ్మకం ఇండస్ట్రీ జనాల్లో ఉంది. అతడు ఎప్పటినుంచో డైరెక్టర్ గా మారడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక మంచి కథ తయారు చేసుకొని హీరోల్ని ఒప్పించుకొనే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కార్తిక్.. రవితేజకు ఒక కథ చెప్పాడని, అది రవితేజకు బాగా నచ్చేసిందని టాక్. రవితేజ ఓకే అంటే సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. పైగా కార్తిక్ ఘట్టమనేని లాంటి స్టార్ కెమేరా మేన్ సినిమా అనేసరికి మంచి క్రేజ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కు నిర్మాత దొరుకుతాడా లేడా అన్నది సమస్యే కాదు. ఎటొచ్చి రవితేజ కాల్షీట్స్ ఖాళీగా ఉన్నాయా లేవా అన్నదే ప్రశ్న. రవితేజ కానీ రెడీ అంటే.  అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చబోతోందని సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి. 

Updated Date - 2022-06-19T22:25:58+05:30 IST

Read more