సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Raviteja : మరో యువ దర్శకుడికి అవకాశం?

ABN, First Publish Date - 2022-06-16T16:56:32+05:30

యాంకర్ ప్రదీప్‌ (Pradeep) ను ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ (30 rojullo Preminchadam Ela? ) అనే చిత్రంతో హీరోగా తెరకు పరిచయం చేసిన యువ దర్శకుడు మున్నా (Munna) దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత చిత్రం ‘ఖిలాడి’ (Khiladi) ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయినప్పటికీ జయాపజయాలతో సంబంధం లేకుండా.. వరుస సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం కొత్త దర్శకుడు శరత్ మండవ (Sharath Mandava) తెరకెక్కిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao Onduty) విడుదలకు సిద్ధమవుతోంది. నక్కిన త్రినాథరావు (Nakkin Trinatharao) దర్శకత్వంలో ‘ధమాకా’ (Dhamaka) చిత్రం కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇంకా సుధీర్ వర్మ (Sudheer Varma) ‘రావణాసుర’ (Ravanasura), కొత్త దర్శకుడు వంశీ రూపొందిస్తున్న క్రైమ్ బయోపిక్ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao) సెట్స్‌పై ఉన్నాయి. వీటితో పాటు రవితేజ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 154 చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇవి కాకుండా రవితేజ మరో యువ దర్శకుడికి అవకాశమిచ్చినట్టు సమాచారం.


యాంకర్ ప్రదీప్‌ (Pradeep) ను ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ (30 rojullo Preminchadam Ela? ) అనే చిత్రంతో హీరోగా తెరకు పరిచయం చేసిన యువ దర్శకుడు మున్నా (Munna) దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. మున్నా వినిపించిన కథ రవితేజకు బాగా నచ్చడంతో స్టోరీని డవలప్ చేయమని చెప్పాడట. ప్రస్తుతం మున్నా స్ర్కిప్ట్ వర్క్‌లో ఉన్నట్టు వినికిడి. రవితేజ బాడీలాంగ్వేజ్‌కు అనుగుణంగా ఒక అదిరిపోయే కామెడీ ఎంటర్ టైనర్‌ను‌ తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను టేకప్ చేస్తోందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోంది. మరి మున్నా మాస్ మహారాజ కోసం ఏ తరహా కథ రాసుకున్నాడో చూడాలి. 

Updated Date - 2022-06-16T16:56:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!