ఒకేరోజు రవితేజ - నిఖిల్ చిత్రాలు విడుదల..?

ABN , First Publish Date - 2022-03-24T16:34:46+05:30 IST

ఒకేరోజు మాస్ మహారాజ రవితేజ, యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనేది తాజా సమాచారం. 'క్రాక్' సినిమా తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన రవితేజ గత నెలలో 'ఖిలాడి' చిత్రంతో వచ్చాడు.

ఒకేరోజు రవితేజ - నిఖిల్ చిత్రాలు విడుదల..?

ఒకేరోజు మాస్ మహారాజ రవితేజ, యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయనేది తాజా సమాచారం. 'క్రాక్' సినిమా తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన రవితేజ గత నెలలో 'ఖిలాడి' చిత్రంతో వచ్చాడు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం 'రామారావు ఆన్‌డ్యూటీ', 'ధమాకా', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో రూపొందుతున్న మెగా 154లో నటిస్తున్నాడు.


ఇక నిఖిల్ 'అర్జున్ సురవరం' మూవీతో హిట్ అందుకున్నా.. కరోనా కారణంగా తన నెక్స్ట్ సినిమాలు రెండూ షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. థర్డ్ వేవ్ తర్వాత నిఖిల్ ఆ రెండు చిత్రాలను పూర్తి చేస్తున్నాడు. 'కుమారి 21 F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రాతాప్ దర్శకత్వంలో నటిస్తున్న '18 పేజెస్', చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న కార్తికేయ సీక్వెల్ నిఖిల్ నుంచి రానున్నాయి. ఈ రెండు సినిమాలలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. కాగా, రవితేజ నటిస్తున్న 'రామారావు ఆన్‌డ్యూటీ' జూన్ 17వ తేదీన థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం నిఖిల్ '18 పేజెస్' మూవీ కూడా అదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఖాయం.

Updated Date - 2022-03-24T16:34:46+05:30 IST