‘ఖుషీ’ స్టోరీలైన్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా?

ABN , First Publish Date - 2022-04-03T15:29:06+05:30 IST

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా తెచ్చిపెట్టిన ఆత్మ విశ్వాసంతో వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. రెండో సినిమా ‘కొండపొలం’ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. అందులోని అతడి పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా వైష్ణవ్ తేజ్ నటించిన డిఫరెంట్ లవ్ స్టోరీ ‘రంగరంగ వైభవంగా’. తమిళంలో ‘ఆదిత్య వర్మ’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న గిరీశయ్య ఈ సినిమాకి దర్శకుడు. జూలై 1న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా కథాంశం పవర్ స్టార్ ‘ఖుషీ’ తరహాలోనే ఉంటుందని సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం ‘ఖుషీ’.  యస్.జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో పవర్ స్టార్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అందులో ఆయన నటన, మేనరిజమ్స్, ఫైట్స్ , డ్యాన్స్ అప్పటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూపాయి. పవర్ స్టార్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్ మూవీగా నిలిచిపోయిన ఈ సినిమా హీరో, హీరోయిన్స్ ఇగో క్లాష్ నేపథ్యంలో రూపొందింది. అచ్చంగా అలాగే.. ‘రంగరంగ వైభవంగా’ సినిమాలోనూ నాయికానాయకుల ఇగో నేపథ్యంలో తెరకెక్కిందని తెలుస్తోంది. మెడికల్ స్టూడెంట్స్ అయిన హీరో, హీరోయిన్స్  లవ్ అండ్ వార్ అభిమానుల్ని మెప్పిస్తుందని సమాచారం. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను యస్వీసీసీ బ్యానర్ పై బీవీయస్ యన్ ప్రసాద్ నిర్మించారు.  మరి నిజంగానే ఈ సినిమా ‘ఖుషీ’ స్టోరీలో లైన్ తో తెరకెక్కిందో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. 

Updated Date - 2022-04-03T15:29:06+05:30 IST

Read more