'మానాడు' తెలుగు రీమేక్‌లో రానా - నాగ చైతన్య..?
ABN , First Publish Date - 2022-02-15T14:01:32+05:30 IST
'మానాడు' తెలుగు రీమేక్‌లో రానా - నాగ చైతన్య..కలిసి నటించబోతున్నట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, వీరిలో ఒకరైనా ఖచ్చితంగా ఈ మూవీ రీమేక్‌లో నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

'మానాడు' తెలుగు రీమేక్‌లో రానా - నాగ చైతన్య..కలిసి నటించబోతున్నట్టు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, వీరిలో ఒకరైనా ఖచ్చితంగా ఈ మూవీ రీమేక్‌లో నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 'మానాడు' చిత్రం తమిళంలో సూపర్ హిట్ సాధించిన సినిమా. దీనిలో శింబు, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించగా, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగ చైతన్య నటించబోతున్నట్లు ఇంతకముందు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు రానా హీరోగా నటించబోతున్నాడని కొత్తగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ తెలుగు రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సూరేశ్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసింది. కాబట్టి వీరిద్దరు కలిసి నటించవచ్చు..లేదా ఇద్దరిలో ఒకరైనా ఖచ్చితంగా నటించే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మేకర్స్ ఎప్పుడు ఇస్తారో.