‘శ్యామ్ సింగరాయ్’ దర్శకుడితో రామ్ చరణ్ ?

ABN , First Publish Date - 2022-01-10T14:54:34+05:30 IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్, ఆచార్య’ చిత్రాల విడుదల హడావిడిలో ఉన్నాడు. తదుపరిగా శంకర్ దర్శకత్వంలో చెర్రీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూ్ల్స్ పూర్తి చేసుకుంది చిత్రం. ‘ఇండియన్ 2’ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’, ఆచార్య’ చిత్రాల విడుదల తర్వాత శంకర్ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని అనుకున్న చరణ్.. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా విడుదల వాయిదా పడడంతో శంకర్ సినిమా షూట్ ను చరణ్ తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తోంది.

‘శ్యామ్ సింగరాయ్’ దర్శకుడితో రామ్ చరణ్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్, ఆచార్య’ చిత్రాల విడుదల హడావిడిలో ఉన్నాడు. తదుపరిగా శంకర్ దర్శకత్వంలో చెర్రీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూ్ల్స్ పూర్తి చేసుకుంది చిత్రం. ‘ఇండియన్ 2’  కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. నిజానికి  ‘ఆర్.ఆర్.ఆర్’, ఆచార్య’ చిత్రాల విడుదల తర్వాత శంకర్ చిత్రాన్ని కంప్లీట్ చేయాలని అనుకున్న చరణ్.. ‘ఆర్.ఆర్.ఆర్’  సినిమా విడుదల వాయిదా పడడంతో శంకర్ సినిమా షూట్ ను చరణ్ తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా మూవీని ప్రారంభించబోతున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత ప్రశాంత్ నీల్, సుకుమార్ కూడా లైన్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. చెర్రీ మరో దర్శకుడ్ని కూడా తన లిస్ట్ లో వేసుకున్నట్టు తెలుస్తోంది. 


ఇటీవల నానీతో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం తీసి సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. బెంగాలీ నేపథ్యంలో తీసిన ఈ పీరియాడికల్ మూవీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవల రాహుల్.. చరణ్ కు ఓ థ్రిల్లర్ స్టోరీ వినిపించాడని, దానికి చెర్రీ బాగా ఇంప్రెస్ అయి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే ఈ సినిమా కార్యరూపం దాల్చడానికి చాలా టైమ్ పడుతుంది. శంకర్ తర్వాత ముగ్గురు దర్శకులు పాన్ ఇండియా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు. అవి పూర్తయ్యాకా గానీ, రాహుల్ సినిమాను మొదలు పెట్టడం సాధ్యం కాదు. మరి రాహుల్ సాంకృత్యన్ అంత వరకూ ఆగుతాడా? లేక వేరే హీరోతో మరో సినిమాకి కమిట్ అవుతాడా అన్నది చూడాలి. 

Updated Date - 2022-01-10T14:54:34+05:30 IST