రామ్‌చరణ్ డిజిటల్ ఎంట్రీ ?
ABN , First Publish Date - 2022-02-15T16:31:59+05:30 IST
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేనెల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశాడు. ఇందులో చెర్రీ సిద్ధగా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరిగా శంకర్ దర్వకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాని కూడా కన్ఫర్మ్ చేశాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేనెల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశాడు. ఇందులో చెర్రీ సిద్ధగా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరిగా శంకర్ దర్వకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాని కూడా కన్ఫర్మ్ చేశాడు. ఇదిలా ఉంటే.. త్వరలో రామ్ చరణ్ డిజిటల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. నెట్ ఫ్లిక్స్ కోసం చెర్రీ ఓ వెబ్ సిరీస్ ను చేయబోతున్నట్టు టాక్. సూపర్ హిట్ యుఎస్ఎ సిరీస్ ను రీమేక్ చేయబోతున్నారట.
నెట్ ఫ్లిక్స్ ప్రస్తుతం దక్షిణాది తారలతో డిజిటల్ కంటెంట్ ను రెడీ చేసే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగా చెర్రీతో వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ టీమ్ రామ్ చరణ్ ను కలవబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే.. ఈ ఏడాదే వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళుతుందట. మరి డిజిటల్ రంగంలో చెర్రీ ఎంట్రీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.