‘రాధేశ్యామ్’ వచ్చేది అప్పుడేనా?

ABN , First Publish Date - 2022-01-16T19:25:05+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యా్మ్’ చిత్రం ఈ పాటికి థియేటర్స్ లో రన్ అవుతూ ఉండాలి. కానీ, కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేసుకుంది. సినిమాకి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకూ ఆ అప్డేట్ రాలేదు. అభిమానులు కొత్త డేట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మార్చ్ 17న విడుదల కానుందని సమాచారం.

‘రాధేశ్యామ్’ వచ్చేది అప్పుడేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  నటించిన ‘రాధేశ్యా్మ్’ చిత్రం ఈ పాటికి థియేటర్స్ లో రన్ అవుతూ ఉండాలి. కానీ,  కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా వేసుకుంది. సినిమాకి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇప్పటి వరకూ ఆ అప్డేట్ రాలేదు. అభిమానులు కొత్త డేట్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను మార్చ్ 17న విడుదల కానుందని సమాచారం. అప్పటికి కరోనా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని సినిమాను అప్పుడు రిలీజ్ చేస్తేనే బెటరన్నది నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది. 


మార్చ్ రెండు లేదా మూడో వారంలోపు కరోనా పూర్తిగా కంట్రోల్‌లోకి రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే ‘రాధేశ్యామ్’ విడుదలకు మార్చ్ 17ను మించి బెటర్ డేట్ లేదని మేకర్స్ భావిస్తున్నారట. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకున్న ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడిగా నటిస్తుండగా.. ఆయన గురువు పాత్రను కృష్ణంరాజు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి నిజంగా  ‘రాధేశ్యామ్’ చిత్రం ఆ డేట్లోనే రిలీజ్ అవుతుందేమో చూడాలి. 

Updated Date - 2022-01-16T19:25:05+05:30 IST